
తండ్రిపై కొడుకు హత్యాయత్నం
రాయికల్: రాయికల్ పట్టణంలోని మత్తడివాడకు చెందిన చిట్యాల లక్ష్మీనర్సయ్యపై అతని కుమారుడు రాజేందర్ మంగళవారం రాత్రి కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. లక్ష్మీనర్సయ్య స్థానికంగా హోటల్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాపిల్లలు తిండి పెట్టడం లేదు. దీంతో తల్లి వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో తనకున్న భూమిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రాజేందర్ తండ్రిపై కోపంతో రగిలిపోయాడు. మంగళవారం రాత్రి ఇంటికి రాగానే రాజేందర్ తన స్నేహితులతో కలిసి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో లక్ష్మీనర్సయ్య తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానికులు అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యుల ద్వారా తెల్సింది. సంఘటన స్థలాన్ని ఎస్సై సుధీర్‌రావు పరిశీలించారు. రాజేందర్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.
ఆస్పత్రికి తరలింపు.. పరిస్థితి విషమం