
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
మల్లాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. సోమవారం మండలకేంద్రంతోపాటు పలు గ్రామాల్లో పర్యటించారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. సీఎం చెప్పే అబద్దాలు, కాంగ్రెస్ మోసపూరిత హామీలపై అన్నివర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. స్థాని క సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్దిచెప్పేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మా జీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మా జీ ఎంపీపీ కాటిపెల్లి సరోజన, మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ కదుర్క నర్సయ్య, నాయకులు పాల్గొన్నారు.