స్వగ్రామానికి చేరిన గల్ఫ్ మృతదేహం
కథలాపూర్(వేములవాడ): మండలంలోని పోసానిపేటకు చెందిన గుంట హన్మంతు(42) సౌదీ అరేబియాలో రెండు నెలల క్రితం హత్యకు గురికాగా.. ఆయన మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. హన్మంతు కొన్నేళ్లుగా ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్తున్నాడు. తాను ఉంటున్న గదిలో నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామానికి చెందిన వ్యక్తితో ఫిబ్రవరి 28న గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనలో హన్మంతు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మల్యాల: మండలంలోని జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన వేల్పుల మార్క్ (21) దుర్మరణం పాలయ్యాడు. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. మార్క్ జగిత్యాల నుంచి వేములవాడ వైపు బైక్‌పై వెళ్తున్నాడు. మల్యాల క్రాస్‌రోడ్ వద్దకు రాగానే కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో మార్క్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108 లో జగిత్యాల ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మార్క్ తండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ కోన శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు
జగిత్యాల: ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రంలో నాల్గో స్థానంలో నిలిచామని డీఈవో రాము అన్నారు. పలు సంఘాల నాయకులు డీఈవోను సత్కరించారు. సమష్టి కృషితో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుదామన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మచ్చ శంకర్, బైరం హరికిరణ్, పీఆర్టీయూ ప్రధానకార్యదర్శి యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాజు, మహేశ్, తోట రాజేశ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కన్నవేని మల్లారెడ్డి, సురేందర్, రవి, రాంగోపాల్, రాకేశ్, గుర్రం శ్రీనివాస్, శంకరయ్య, కుమారస్వామి, తపస్ జిల్లా అధ్యక్షుడు దేవయ్య, ప్రసాద్‌రావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నరేందర్‌రావు పాల్గొన్నారు.
స్వగ్రామానికి చేరిన గల్ఫ్ మృతదేహం


