
క్యూలైన్‌లో భక్తులు
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి వారిని శనివారం వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 25వేల మంది భక్తులు తరలివచ్చినట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. భక్తుల ఏర్పాట్లను ఏఈవో బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్ శ్రీనివాస శర్మ, ఆలయ అధికారులు, సిబ్బంది పర్యవేక్షించారు.
విజయం కాంగ్రెస్‌దే..
రాయికల్: జగిత్యాలలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం రాయికల్‌లోని పార్టీ కార్యాలయంలో ఏజెంట్లు, నాయకులతో సమావేశం అయ్యారు. దళితులు, మైనార్టీలు, నిరుపేదలు, మహిళలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్, కౌన్సిలర్ మ్యాకల అనురాధ, మున్ను, గన్నవరం ప్రభాకర్, ఎద్దండి భూంరెడ్డి, శంషేర్, లక్ష్మీనారాయణ, వాసం దిలీప్ పాల్గొన్నారు.

కార్యకర్తలతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి