
జగిత్యాలలో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: జగిత్యాల అభివృద్ధిని చూడండి, మరోసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 23,24,39,40,46,1,2వ వార్డుల్లో కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులవి ఓట్ల రాజకీయాలే తప్ప వారు చేసిందేమీ లేదన్నారు. అ లాగే నియోజకవర్గస్థాయి విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు గట్టు సతీశ్, వెంకటరమణ, టీవీ సత్యం పాల్గొన్నారు.
అన్ని వర్గాలకు అండగా సీఎం కేసీఆర్
అన్నివర్గాలకు అండగా సీఎం కేసీఆర్ ఉన్నారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని మసీదుల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ మైనార్టీల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని, మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
సంక్షేమ పథకాలు చూసి..
జగిత్యాలరూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసే ప్రజలు బీఆర్‌ఎస్‌కు చేరువవుతున్నారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్లకు చెందిన 20 మంది , సంగంపల్లికి చెందిన యాదవ సంఘం అధ్యక్షుడు మల్లేశం, 25 మంది బీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే సంజయ్‌కుమార్‌కు పొరండ్లకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు దుంపల కరుణాకర్‌రెడ్డి రూ.10 వేల ఆర్థికసాయం అందజేశారు.
నిరుపేదలకు అండగా ఉంటా
రాయికల్(జగిత్యాల): నిరుపేదలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం రాయికల్ మండలం సింగరావుపేట, అల్లీపూర్, కుర్మపల్లి, కిష్టంపేట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అయోధ్య గ్రామానికి చెందిన 20 మంది యువకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మాయమాటలు నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ జాదవ్ అశ్విని, ఎంపీటీసీ మోర విజయలక్ష్మీ, సర్పంచులు రాంచందర్‌రావు, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయం
జగిత్యాల రూరల్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. శుక్రవారం రాత్రి జగిత్యాల అర్బన్ మండలం దరూర్‌లో ఎమ్మెల్సీ రమణ, జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంతతో కలిసి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు. జెడ్పీటీసీ మహేశ్, నాయకులు పాల్గొన్నారు.
● జగిత్యాల అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్

అల్లీపూర్‌లో ఓట్లు అభ్యర్థిస్తున్న ఎమ్మెల్యే సంజయ్