పూజలు చేస్తున్న ఐజీ తరుణ్ జోషి
ధర్మపురి: పోలీసు ఇన్‌స్పెక్టర జనరల్(ఐజీ) తరుణ్ జోషి మంగళవారం రాత్రి ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. తొలుత దేవస్థానం తరఫున ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లోనూ ఐజీ పూజలు చేశారు. దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్.. ఐజీకి స్వామివారి శేషవస్త్రం కప్పి ప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో ఎస్పీ భాస్కర్, డీఎస్పీ ప్రకాశ్, సీఐ కోటేశ్వర్, ఎస్సై కిరణ్‌కుమార్, వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ, ముత్యాలశర్మ, ముఖ్య అర్చకుడు నంబి శ్రీనివాసచారి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


