100 Days Of War: దాదాపు 20% ఉక్రెయిన్‌ భూభాగం రష్యా హస్తగతం!

Zelensky Told 20 Percent Ukrainian Territory In Russian Hands - Sakshi

100 Days Of War Russia Now Holds 20% Ukraine Territory: ఉక్రెయిన్‌ పై రష్యా దురాక్రమణకు దిగి నేటికి వంద రోజులైంది. ఈ వందరోజుల నిరవధిక దాడుల్లో రష్యా 20 శాతం ఉక్రెయిన్‌ భూభాగాన్ని అధీనంలో ఉంచుకుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌ స్కీ పేర్కొన్నారు. 2014లో స్వాధీనం చేసుకున్న డాన్‌బాస్‌లోని కొన్ని భూభాగాలతో సహా ఉక్రెయిన్‌ భూభాగంలో ఐదవ వంతు మాస్కో నియంత్రణలో ఉందని కీవ్‌ ప్రకటించింది. అదీగాక ఉక్రెయిన్‌ దళాలు రష్యా బలగాలను రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరిమికొట్టడంతో తూర్పు ఉక్రెయిన్‌ని స్వాధీనం చేసుకోవడం పై మాస్కో దృష్టి సారించింది.

ఈ యుద్ధ భూమిలో ప్రతి రోజు సుమారు 100 మంది దాక ఉక్రెయిన్‌ సైనికులు నేలకొరుగుతున్నారని జెలెన్‌ స్కీ పేర్కొన్నారు. ఈ మేరకు యూఎస్‌ అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన సమావేశ అనంతరం నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఉక్రెయిన్‌ మిత్రదేశాలు ఈయుద్ధం క్షీణించేలా ఆయుధాలను అందించాలని పిలుపునిచ్చారు.  తాము రష్యాతో నేరుగా యుద్ధానికి దిగాలనుకోవడంలేదని పునరద్ఘాటిస్తూ... ఈ యుద్ధంలో రష్యా బలగాలు ఊహించనిదానికంటే ఎక్కువగానే పురోగమిస్తున్నాయని అన్నారు. యూఎస్‌ నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు సైతం ఉక్రెయిన్‌కి ఆయుధాలను, సైనిక సామాగ్రిని అందజేశాయి. అంతేగాదు ఉక్రెయిన్‌కి యూఎస్‌ రాయబారి బ్రిడ్జేట్ బ్రింక్ రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ విజయం సాధించేలా యూఎస్‌ సాయం చేస్తుందని హామీ ఇచ్చారు.

అందులో భాగంగానే యూఎస్‌ ఉక్రెయిన్‌కి సుమారు 700 మిలియన్‌ డాలర్ల ఆయుధా సామాగ్రి ప్యాకేజిని ప్రకటించింది. దీంతో మాస్కో ఉక్రెయిన్‌ విషయంలో యూఎస్‌ అగ్నికి ఆద్యం పోస్తున్నట్లుగా వ్యవహరిస్తోందంటూ అమెరికా పై విరుచుకుపడుతోంది. ఈ మేరకు రష్యా ఆర్థిక పరిస్థితిని ఉక్కిబిక్కిర చేసేలా అమెరికా దాని మిత్రదేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా చమురు సరఫర పై కూడా యూరప్‌ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ఈ పాక్షిక చమురు నిషేధానికి భారీ మూల్య చెల్లిస్తారంటూ యూరప్‌ దేశాలను హెచ్చరించింది. ఐతే ప్రపంచంలోని ధాన్యాల ఉత్పత్తిదారుల్లో ఉక్రెయిన్‌ పాత్ర కీలకం కావడంతో ఈయుద్ధం ప్రపంచ ఆహార సంక్షోభాన్ని ప్రేరేపించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇప్పటికే తృణధాన్యాలు, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ నుంచి మొక్కజోన్న వరకు అన్ని అధిక ధరలు పలుకుతుండటం గమనార్హం.
(చదవండి:  మరింత మద్దతు.. ‘రష్యా పని పట్టడానికి అత్యాధునిక ఆయుధాలిస్తాం’)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top