ఇరాన్‌పై అమెరికా రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు | Us Secretary Of Defense Hegseth Sensational Comments On Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై అమెరికా రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Apr 8 2026 6:00 PM | Updated on Apr 8 2026 6:29 PM

Us Secretary Of Defense Hegseth Sensational Comments On Iran

సీజ్‌ఫైర్‌ కోసం ఇరాన్‌ మ​‍మ్మల్ని వేడుకుందంటూ అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సాహసంతో చరిత్ర సృష్టించారన్న పీట్ హెగ్సెట్.. 10 శాతం లోపు ఆయుధాలను మాత్రమే వినియోగించామని.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని సహా కీలక మంత్రులు, మిలిటరీ అధికారులను అంతం చేశామని పేర్కొన్నారు.

ఇరాన్ అణు వ్యవస్థను ధ్వంసం చేశాం. ఇక అణు బాంబులను తయారు చేయలేదు. ఎపిక్ ఫ్యూరీతో మా లక్ష్యాలను పూర్తి చేశాం. శాంతికి ఒప్పందాలు కుదుర్చుకుంటామని పీట్‌ హెగ్సెత్‌ అన్నారు.

‘‘ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాం. ఇరాన్‌ ఎప్పటీకీ అణ్వాయుధాలు కలిగి ఉండదు. ఇరాన్‌  న్యూక్లియర్‌ సెంటర్లను తొలగించేశాం.  మా షరతులకు ఇరాన్‌ కట్టుబడి ఉంటుందని నమ్ముతున్నాం. ఒప్పందాలు చేసుకోవడంలో ట్రంప్‌ తర్వాతే ఎవరైనా. తీవ్ర ఒత్తిడికిలోనై ఇరాన్‌ కాల్పుల విరమణకు ఒప్పుకుంది. ఇరాన్‌కు క్షమాబిక్ష పెట్టాలని ట్రంప్‌ భావించారు. ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ గొప్ప విజయం సాధించింది’’ అని పీట్‌ హెగ్సెత్‌ పేర్కొన్నారు.

మరో వైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో మరో సంచలన పోస్ట్‌ పెట్టారు. ఇరాన్‌కు ఆయుధాలిచ్చే దేశాలపై 50 శాతం టారిఫ్‌లు విధిస్తామని.. టారిఫ్‌ల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవంటూ ట్రంప్‌ తేల్చి చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement