ప్రస్తుతం పశ్చిమాసియాను శాంతి మేఘాలు అలుముకున్నాయి. ఇరు దేశాలు సీజ్‌ఫైర్ ఒప్పందం పాటించడంతో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే నిన్న ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రపంచాన్నే ఊలిక్కి పడేలా చేశాయి. నాగరికతను అంతం చేస్తా అని ట్రంప్ హెచ్చరించడంతో ఏం జరగనుందా అని అంతా ఆందోళన పడ్డారు. అంతలోనే సీజ్ ఫైర్ ఒప్పందంఅయితే ఇదంతా అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి వ్యూహంలో భాగమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం నడుస్తోంది. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం కోసం అమెరికా గుడ్ కాప్- బాడ్ కాప్ వ్యూహాన్ని అమలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక వైపేమో డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలతో ఇరాన్‌ను భయ భ్రాంతులకు గురి చేయగా ..మరో వైపేమో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెరవెనుక ప్రశాంతంగా రాయబారం నడిపి ఇరాన్‌ని దారికి తెచ్చేలా వ్యవహరించారని రాయిటర్స్ కథనం పేర్కొంది.
మెుదటి నుంచి జేడీవాన్స్ యుద్దాన్ని వ్యతిరేకిస్తున్నారు.ఇదే సమయంలో ట్రంప్ సన్నిహితులైన కుష్నర్ లేదా విట్‌కాఫ్ వంటి వారి మాటలను పెద్దగా పట్టించుకోని ఇరాన్..జేడీవాన్స్ మాటలకు మాత్రం గౌరవం ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ వాన్స్‌తో ఒప్పందం కుదరకపోతే ఇక దేనికీ ఆస్కారం ఉండదు అని భావించినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో వాన్స్ సైతం యుద్ధాన్ని ముగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. గత నెలలో కాల్పుల విరమణకు ఏమాత్రం అవకాశం లేని సమయంలో యూఏఈ ,సౌదీ అరేబియాతో సహా గల్ఫ్ దేశాల నాయకులతో పాటు, ఇజ్రాయెల్ అధ్యక్షుడితో వరుస చర్చలు జరిపినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.
మెుత్తానికి జేడీవాన్స్ ఇరాన్‌ని చర్చల ద్వారా సీజ్‌ఫైర్ ఒప్పందం చేయించడంలో సఫలీకృతం అయ్యారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల అమెరికా వనరులు వృధా అవుతాయని, అది దేశానికి భారీ ఆర్థిక భారమని నమ్మేవారు. ఇదే విషయమై ట్రంప్‌ని కూడా ఒప్పించినట్లు తెలుస్తోంది.


