బోరిస్‌ జాన్సన్‌ సన్నిహితుల రాజీనామా | UK PM Boris Johnson 5th aide quits amid partygate scandal | Sakshi
Sakshi News home page

బోరిస్‌ జాన్సన్‌ సన్నిహితుల రాజీనామా

Feb 5 2022 6:01 AM | Updated on Feb 5 2022 6:01 AM

UK PM Boris Johnson 5th aide quits amid partygate scandal - Sakshi

లండన్‌: పార్టీగేట్‌ కుంభకోణం బ్రిటిన్‌ను కుదిపేస్తోంది. ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌కు సన్నిహితులైన నలుగురు ఉన్నతాధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆరోపణల నుంచి బయటపడేందుకు బోరిస్‌ జాన్సన్‌ వారితో రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి పాలసీ చీఫ్‌ మునిరా మీర్జా, చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ డాన్‌ రోసెన్‌ఫీల్డ్, ప్రిన్సిపల్‌ ప్రైవేట్‌ సెక్రెటరీ మార్టిన్‌ రేనాల్డ్, కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ జాక్‌ డోయెల్‌ తాజాగా తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) అంతటా కఠినమైన ఆంక్షలు అమలవుతున్న సమయంలో ప్రధానమంత్రి అధికార నివాసమైన డౌనింగ్‌ స్ట్రీట్‌లో విచ్చలవిడిగా విందులు చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement