రోమ్: ఇటలీలోని బెర్గామో ప్రావిన్స్ పారిశ్రామిక కోవో పట్టణంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వైశాఖి పండుగ వేళ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గురుద్వారా మాతా సాహిత కౌర్ జీలో ప్రార్థనల అనంతరం బయటకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతులను కోవోకు చెందిన రగీందర్ సింగ్(48), అగ్నడెల్లో వాసి గుర్మీత్ సింగ్(48)గా గుర్తించారు. దుండగుడు వారిపై అతి సమీపంలో నుంచి కాల్పులు జరిపి, కారులో పరారయ్యాడని మీడియా తెలిపింది. అంతకుముందు వారి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. తరచూ గురుద్వారాకు వచ్చే ఓ భారతీయుడే పథకం ప్రకారం ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.


