పాక్‌ను ఆ లిస్టులోంచి తీసేయండి: టర్కీ

Turkey Supports Removing Pak From FATF Grey List - Sakshi

పారిస్‌ : జమ్ము కశ్మీర్‌ విషయంలోనే కాదు మిగిలిన అన్నిట్లోనూ పాకిస్తాన్‌కు టర్కీ తోడుగా నిలుస్తోంది. శుక్రవారం పైనాన్షినియల్‌ యాక్షన్‌ టాక్క్‌ ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) పారిస్‌ ప్లీనరీ మీటింగ్‌లో పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌నుంచి తొలగించాలని టర్కీ కోరింది. ఎఫ్‌ఏటీఎఫ్‌లో ఉన్న 39 దేశాలలో పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచిన దేశం టర్కీ ఒక్కటే కావటం విశేషం. మిగిలిన అన్ని దేశాలు కూడా పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో ఉంచడానికే మొగ్గుచూపాయి. అయితే, ఇంటర్‌నేషనల్‌ కోఆపరేషన్‌ రివ్యూ గ్రూప్‌(ఐసీఆర్‌జీ) మీటింగ్‌లో సాంకేతిక కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌ నుంచి తొలగించాలని టర్కీ, చైనా , సౌదీ అరేబియా దేశాలు మాట్లాడినప్పటికి టర్కీ మాత్రమే అందుకు మద్దతుగా నిలిచింది. పాకిస్తాన్‌ గ్రే లిస్ట్‌ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 2021న ప్లీనరీ ముందు సమీక్ష జరగనుంది. (మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ‌ పాకిస్తాన్-చైనా దొంగ‌బుద్ధి)

కాగా, జమ్ము కశ్మీర్‌ అంశంలో పాకిస్తాన్‌కు మద్దతుగా నిలుస్తామని టర్కీ అధ్యక్షుడు రెసీప్‌ తయీప్‌ ఎర్డోగన్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే ‘‘దశాబ్దకాలంగా మా కశ్మీరీ సోదరసోదరీమణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏకపక్ష నిర్ణయాల కారణంగా వారికి ఈ దుస్థితి వచ్చింది. కశ్మీర్‌ గురించి ఈరోజు పాకిస్తాన్‌ ఎంతగా వేదన చెందుతుందో.. టర్కీ కూడా అంతే బాధపడుతోంది. ఈ విషయంలో అన్ని వర్గాలు న్యాయబద్ధంగా వ్యవహరించాలి. మేం న్యాయం వైపునే నిలబడతాం. కశ్మీర్‌ అంశంపై శాంతియుత చర్చలు జరిగితేనే చక్కని పరిష్కారం దొరుకుతుంది. ఈ విషయంలో పాకిస్తాన్‌కు ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top