కాలిఫోర్నియాలో  కూలిన విమానం | Small Plane Crashes Into South California Commercial Building, More Details Inside | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో  కూలిన విమానం

Jan 3 2025 9:09 AM | Updated on Jan 4 2025 5:26 AM

Small Plane Crash In South California

ఇద్దరు మృతి, 18 మందికి గాయాలు

కాలిఫోర్నియా: వరుస విమాన ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. కాలిఫోర్ని యాలో విమాన ప్రమాదం జరిగింది.  డిస్నీల్యాండ్‌కు సమీపంలోని ఆరెంజ్‌ కౌంటీలో ఉన్న ఫుల్లర్టన్‌ మున్సిపల్‌ విమానాశ్రయంలో టేకాఫ్‌ అయిన నిమిషంలోనే విమానం కుప్పకూలింది. ఓ వాణిజ్య భవనం పైకప్పుపై పడింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 2.09 గంటలకు ఈ ఘటన జరిగింది. 

సింగిల్‌ ఇంజన్‌ కలిగిన నాలుగు సీట్ల చిన్న విమానమే అయినప్పటికీ.. ఫర్నీచర్‌ గోదామ్‌పై కుప్పకూలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. విమానం కూలగానే గోదాములో మంటలు చెలరేగాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేసి సమీప భవనాలను ఖాళీ చేయించారు. గతేడాది నవంబర్‌లో మరో చిన్న విమానం టేకాఫ్‌ అయిన వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేస్తుండగా విమానాశ్రయానికి అర మైలు దూరంలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. విమానంలో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి.
 

California: కూలిన విమానం

ఇదీ చదవండి: ట్రక్కు దాడి.. ఎఫ్‌బీఐ కీలక ప్రకటన 

Advertisement
 
Advertisement
Advertisement