వైరల్‌: ఇంట్లోకి దూరిన ‘దెయ్యం నీడ’.. సీసీటీవీలో రికార్డు

Scattland Shadowy Figure in CCTV Prompts Woman to Call Priest to Her House - Sakshi

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న అనుమానాస్పద నీడ వీడియో

ఎడిన్బర్గ్: దెయ్యాలు ఉన్నాయా అంటే.. చాలా మంది అవుననే అంటారు. కొద్ది మాత్రం వాటిని కొట్టి పారేస్తారు. ఇక ఇంటర్నెట్‌లో దెయ్యాల గురించి శోధిస్తే.. లెక్కకు మిక్కిలి వీడియోలు కనిపిస్తాయి. వీటిలో చాలా వరకు టెక్నాలజీ సాయంతో తయారు చేసిన వీడియోలే అని మనం ఈజీగా గుర్తింవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో సీసీటీవీ కెమరాలో వింత వింత ఆకారాలు, సంఘటనలు రికార్డయ్యి మనుషులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎక్కడో రోడ్డు మీదనో.. నివాసా ప్రాంతాల్లో రికార్డయ్యే ఈ సంఘటనలు చూస్తే.. అబద్దం అని కొట్టి పారేయలేం.. అలా అని అవి ఏంటో కూడా కరెక్ట్‌గా చెప్పలేం. 

తాజాగా ఇలాంటి భయానక సంఘటన ఒకటి వెలుగు చూసింది. నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంటి సమీపంలో అకస్మాత్తుగా పెద్ద నీడ కనిపించింది. అది కాస్తా ఇంట్లోకి దూరింది. సీసీకెమారెలో రిక్డారయిన ఈ దృశ్యాలు చూసి ఆ ఇంటి యజమానులు తీవ్రంగా భయపడ్డారు. వెంటనే మతాధికారిని పిలిపించుకుని సమస్యకు పరిష్కారం సూచించాల్సిందిగా కోరారు. స్కాట్‌ల్యాండ్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు.. 

గ్లాస్గో సమీపంలోని బారోఫీల్డ్‌లో నివసిస్తున్న మాక్సిన్ హ్యూస్ అనే మహిళ తన ఇంట్లోని సీసీటీవీ కెమెరా వీడియోలు చూసి షాకైంది. తన గార్డెన్‌లో పార్క్ చేసిన కారవాన్ వద్ద ఓ వింత ఆకారం చక్కర్లు కొడుతూ కనిపించింది. నల్లని నీడలా ఉన్న ఆకారం గాల్లో ఎగురుతూ.. ఇంట్లోకి దూరినట్లు రికార్డయ్యింది. ఈ వీడియో చూసిన షాకైన మాక్సిన్‌.. మతాధికారిని ఆశ్రయించింది. తన ఇంటి చుట్టూ వింత ఆకారాలను చూడటం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు కూడా అలాంటి నీడలను చూశానని మాక్సిన్ తెలిపింది. 

తన పిల్లలు గార్డెన్‌లో ఆడుకుంటున్నప్పుడు వారి చుట్టూ ఆ నీడ తిరిగేదని పేర్కొంది. ఓ రాత్రి తన పార్టనర్‌ కూడా ఆ వింత ఆకారాన్ని చూశాడని, వారాంతం మొత్తం అది ఇంటి చుట్టూ తిరుగుతూ కనిపించిందని మాక్సిన్ వివరించింది. ఇంటిపై ప్రతికూల శక్తుల ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో తాము మతాధికారిని ఆశ్రయించామని తెలిపింది. ‘‘నా చెల్లికి దెయ్యాలంటే ఆసక్తి. అందుకే ఆమెకు ఆ వీడియో పంపించి.. అదేమిటో చెప్పమని అడిగాను’’అని మాక్సిన్ ఓ మీడియా సంస్థకు వెల్లడించింది. మాక్సిన్ సోదరి నిక్కి ముల్హెరాన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోను చూసి నెటిజనులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top