అత్యాచారాన్ని ఆయుధంగా ఉపయోగిస్తోంది!: ఉక్రెయిన్‌

Russian Troops Molestation Used As Weapon Of War in Ukraine - Sakshi

Ukrainian human rights group accused Russian troops: ఉక్రెయిన్‌ పై రష్యా నెలరోజలకు పైగా నిరవధిక యుద్ధం కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌ని అధినంలోకి తెచ్చుకునే క్రమంలో రష్యా యుద్ధ నేరాలకు, అత్యాచారాలకు పాల్పడుతోంది. అంతేగాక యూఎన్‌ భద్రతా మండలిలో ఉక్రెయిన్‌ మానహక్కుల సంఘం ప్రస్తుతం రష్యా బలగాలు అత్యాచారాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించాయి. అదీగాక ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు లైంగిక దాడులు, అత్యాచారాలు వంటి అకృత్యాలకు పాల్పడుతున్నారంటూ పెద్ద ఎత్తున్న ఆరోపణలు వస్తున్నాయని యూఎన్‌ అధికారి భద్రతా మండలికి తెలిపారు.

ఉక్రెయిన్‌ మానవహక్కుల సంఘం నాయకురాలు కాటెరినా చెరెపాఖా రష్యా సైనికులు తొమ్మిది మందిపై అత్యాచారం కేసులు ఉన్నాయని, సుమారు 12 మంది మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని భద్రతా మండలిలో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు ఇప్పుడూ హింస, అత్యాచారాలను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని అన్నారు. తమ ఆవేదనను వినాలని అభ్యర్థించారు. గతవారమే ఐక్యరాజ్యసమితి రష్యన్ దళాల లైంగిక హింస ఆరోపణలను ధృవీకరించడానికి యూఎన్‌ మానవ హక్కుల పర్యవేక్షకులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే.

అయితే ఉక్రెయిన్‌ దళాల పై కూడా లైంగిక ఆరోపణలు వస్తున్నట్లు యూఎన్‌ పేర్కొంది. కానీ దానిపై ఉక్రెయిన్‌ మానవ హక్కుల సంఘం ఇంకా స్పందించలేదు. మరోవైపు రష్యా ఎప్పటికీ పౌరుల పై దాడి చేయదని కేవలం రష్యన్‌ సైనికులను శాడిస్టులుగా చూపించాలనే దురుద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నాయని రష్యా యూఎన్‌ రాయబారి డిమిత్రి పోలియన్స్కీ ఉద్ఘాటించారు.

ఈ మేరకు ఐక్యరాజ్యసమితి మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బహౌస్ మాట్లాడుతూ, న్యాయం, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి అన్ని ఆరోపణలను స్వతంత్రంగా దర్యాప్తు చేయాలి. మేము ఎక్కువగా అత్యాచారం, లైంగిక హింస గురించి వింటున్నాము" అని ఆమె కౌన్సిల్‌లో అన్నారు. ఉక్రెయిన్ యూఎన్‌ రాయబారి సెర్గీ కిస్లిత్సా రష్యన్ సైనికుల అత్యాచార కేసులకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌కి ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం ప్రారంభించిందని భత్రతా మండలికి తెలిపారు.

(చదవండి: రష్యా అరాచకం.. గుంతలు తవ్వి మృతదేహాల ఖననం..!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top