తప్పు చేయొద్దు! అక్రమ వలసదారులకు రిషి సునాక్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Rishi Sunak Vows To Crack Down On Illegal Immigration - Sakshi

బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ అక్రమ వలసదారులను అనుమతించమని ఖరాకండీగా చెప్పేశారు. దేశంలోకి ప్రవేశించే ప్రతి అక్రమ వలసదారుడిని బహిష్కరించడమే గాక ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని కూడా అనుమతించమని స్పష్టం చేశారు. యూరప్‌ నుంచి సరిహద్దులు దాటి ప్రవేశిస్తున్న అక్రమ వలసదారులకు అడ్డుకట్టవేసేలా కఠిన చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. పడవలపై అక్రమంగా ప్రవేశిస్తున్న వలసదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.

అంతేగాక రువాండ లేదు సురక్షితమైన మూడో దేశం నుంచి పడవల ద్వారా అక్రమంగా వస్తున్న వలసదారులను బహిష్కరించి, శాశ్వతంగా రాకుండా నిషేధించేలా హోం సెంక్రటరీ బాధ్యత వహిస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆయన అక్రమ వలసదారులను ఉద్దేశిస్తూ.. తప్పు చేయొద్దు, చట్టవిరుద్ధంగా ఇక్కడకు వస్తే మీరు ఉండలేరు. అక్రమ వలసలు నేరమని, పైగా అక్రమంగా ప్రవేశించిన ముఠాలను అనైతిక వ్యాపారాలు కొనసాగించేలా అనుమతించడం సరికాదని బ్రిటీష్‌ పన్ను చెల్లింపుదారులను హెచ్చరించారు. అలాగే పడవలను ఆపేస్తానన్న నా వాగ్దానాన్ని కూడా నెరవేర్చాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు.

సరిహద్దు దాటిని అక్రమ వలసదారులను అనుమతించడానికి, ఆశ్రయం పొందాలన్న యూకేలోని చట్టాలను అనుసరించాలని చెప్పారు. వలసదారుల కేసు విచారణ కోసం ఉన్నప్పుడూ అనుమతిస్తారని, కానీ కొత్త చట్టం ప్రకారం అటువంటి వలసదారులు మొదటి స్థాయిలో ఆశ్రయం పొందకుండా నిరోధిస్తుందని ప్రధాని రిషి సునాక్‌ చెప్పారు. కాగా, ఫ్రాన్స్‌ నుంచి యూకేకి ప్రమాదకర స్థాయిలో శరణార్థులు వలస రావడాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. 
(చదవండి: పాక్‌లో ఆత్మాహుతి దాడి..తొమ్మిది మంది పోలీసులు మృతి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top