అమెరికా వీసాకు తగ్గిన ఎదురుచూపులు | Reduced wait for US visa | Sakshi
Sakshi News home page

అమెరికా వీసాకు తగ్గిన ఎదురుచూపులు

Mar 30 2023 2:23 AM | Updated on Mar 30 2023 2:23 AM

Reduced wait for US visa - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా వీసా ఇంటర్వ్యూలకు వెయిటింగ్‌ పీరియడ్‌ భారీగా తగ్గిందని ఆ దేశ విదేశాంగ శాఖ డెప్యూటీ అసిస్టెంట్‌ (వీసా సేవలు) జూలీ స్టఫ్‌ వెల్లడించారు. పర్యాటక వీసా ఇంటర్వ్యూల వెయిటింగ్‌ 60 శాతం తగ్గిపోయిందని పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు దౌత్య సేవలను పెంచినట్టు వివరించారు.

కోవిడ్‌ ఆంక్షలు ఎత్తేశాక అమెరికా వీసాల కోసం భారత్‌ నుంచి దరఖాస్తులు వెల్లువెత్తడం తెలిసిందే. దాంతో బిజినెస్, టూరిస్ట్‌ వీసాల వెయిటింగ్‌ పిరియడ్‌ 2022 అక్టోబర్‌లో ఏకంగా 1,000 రోజులకు పెరిగింది. ఈ ఏడాది విద్యార్థి, ఉద్యోగి సహా అన్ని కేటగిరీల్లో 10 లక్షల వీసాలు జారీ చేయాలన్నది లక్ష్యమని స్టఫ్‌ చెప్పారు. ‘వందకు పైగా దౌత్య మిషన్ల ద్వారా భారతీయులకు వీసాలు జారీ చేస్తున్నాం.

బ్యాంకాక్, ఫ్రాంక్‌ఫర్ట్, లండన్, అబూదాబీల్లోనూ దరఖాస్తులను ప్రాసెస్‌ చేస్తున్నాం. భారత్‌లో వీసాల జారీ ప్రక్రియ 40 శాతం పెరిగింంది. గత నెలలో గరిష్టాన్ని తాకింది. కొన్ని విభాగాల్లో ఇంటర్వ్యూలను ఎత్తేయడంతో ప్రాసెసింగ్‌ ప్రక్రియ వేగవంతమైంది. రెన్యువల్‌కు కోసం అమెరికాలోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాం. ఇది భారత టెకీలకు పెద్ద ఊరట’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement