Ecuador: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 14 మంది మృతి..

Peru Ecuador Earthquake Many People Died - Sakshi

పెరు, ఈక్వెడార్‌లోని గయాస్ తీరప్రాంతంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 6.8గా నమోదైంది. 66 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

భూకంపం ధాటికి చాలా ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా మచాలా, క్యుయెన్సా నగరాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉంది. భూప్రకంపనల ధాటికి జనం ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భూకంపం కారణంగా మొత్తం 14 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈక్వెడార్ అధ్యక్షుడు గ్విల్లెర్మో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మచాలాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఇతర నగరాలను కూడా సందర్శిస్తానని చెప్పారు.
చదవండి: కోవిడ్‌ డేటాను చైనా తొక్కిపెడుతోంది

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top