దేశం విడిచి వెళ్లండి

Pakistan orders illegal immigrants, to leave or face deportation - Sakshi

అక్రమంగా అఫ్గాన్‌ నుంచి వచ్చిన శరణార్థులకు పాక్‌ ఆదేశం

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్తాన్‌ నుంచి పాకిస్థాన్‌కు అక్రమంగా వచ్చిన శరణార్థులు వెంటనే దేశం వీడి వెళ్లాలంటూ పాక్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాలిబన్ల పరిపాలనతో విసిగి వేసారిపోయిన అఫ్గాన్లు లక్షల సంఖ్యలో చట్టవిరుద్ధంగా పాక్‌కు చేరుకున్నారు. అలా వచ్చిన వారు 17 లక్షల మంది ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. వారందరూ నవంబర్‌లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

రెండు దేశాల సరిహద్దుల్లో ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోతున్నాయి. అఫ్గాన్‌లో తాలిబన్ల కనుసన్న ల్లో ఉన్న ఉగ్రవాదులే దాడులకు పాల్పడుతున్నారని పాక్‌ ఆరోపి స్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నవంబర్‌ 1లోగా  అక్రమంగా వచ్చిన వారంతా వెళ్లకపోతే భద్రతా బలగాలతో వారిని దేశం నుంచి బహిష్కరిస్తామని పాకిస్థాన్‌ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top