ఇటలీ పడవ ప్రమాదంలో 24 మందికి పైగా పాకిస్తానీలు గల్లంతు

Pak PM Said 24 Pakistanis Drowned In Italy Migrant Boat Wreck - Sakshi

ఇటలీ సముద్ర జలాల్లో వలసదారులు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ప్రమాదంలో 59 మంది గల్లంతవ్వగా, వారిలో 24 మంది పాకిస్తానీలు ఉన్నట్లు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తెలిపారు. ఈ ప్రమాదం నుంచి సుమారు 81 మంది ప్రాణాలతో బయటపడగా, ఇంటెన్సివ్‌ కేర్‌లో చికిత్స తీసుకుంటున్న వ్యక్తితో సహా 20 మంది ఆస్పత్రి పాలైనట్లు ఇటాలియన్‌ అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో 58 మృతదేహాలను వెలికితీశారని, 61 మంది ప్రాణాలను రక్షించినట్లు వెల్లడించారు. టర్కీ నుంచి బయలుదేరిన ఈ చెక్క పడవలో ఇరాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు డజన్ల మందికి పైగా పాకిస్తానీయులు మునిగిపోయారన్న నివేదికలు త్రీవ ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని షరీఫ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సాధ్యమైనంత త్వరగా వాస్తవాలను నిర్థారించాలని విదేశాంగ కార్యాలయాన్ని ఆదేశించారు. కాగా, మానవ స్మగ్లర్లు యూరప్‌లోకి వలసదారులను అక్రమంగా రవాణా చేయడానికి ఉపయోగించే మార్గాలలో టర్కీ ఒకటి.

(చదవండి: ఇటలీ సముద్ర జలాల్లో పడవ మునక )

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top