మరో ఛాన్స్‌ ఇచ్చినా పోలీస్‌నే అవుతా!.. రిస్క్‌లో కిక్కు వెతుకుంటున్న బ్యూటీ

Meet Colombia Diana Ramirez Most Beautiful Cop In the World - Sakshi

వైరల్‌: ‘దేవుడు మరో అవకాశం ఇస్తే..’ ఇప్పుడున్న జీవితాన్ని పూర్తిగా మార్చేసుకోవాలని కోరుకుంటారు ఎక్కువ మంది!. కానీ, ఈ అందమైన శివంగి మాత్రం అలా కాదు.. తాను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉండాలనుకుంటోంది. అది శారీరకంగా కాదు.. మానసికంగా!. డబ్బు కోసమో, సుఖం కోసమో ఆమె అస్సలు ఆశపడడం లేదు. ఎందుకంటే.. వ్యవస్థలో చెడుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆమె.. తనలాగే బతకాలనుకుంటోంది కాబట్టి!

కొలంబియా మెడెలిన్‌కు చెందిన డియానా రామిరెజ్‌diana ramirez.. ఈ మధ్య తరచూ వార్తల్లో కనిపిస్తోంది. అందుకు కారణం ఆమె అందం. ప్రపంచంలోనే అత్యంత అందమైన పోలీసాఫీసర్‌గా ఇంటర్నెట్‌లో ఆమెపై ఓ ప్రచారం నడుస్తోంది. అఫ్‌కోర్స్‌.. ఈమె కంటే అందగత్తెలు ఉండొచ్చు. కానీ, ఇప్పటికైతే ఈమెదే హవా నడుస్తోంది.


 

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నగరంగా పేరున్న మెడెలిన్ వీధుల్లో పోలీస్‌ అధికారిణిగా డియానా రామిరెజ్‌ పహారా కాస్తూ కనిపిస్తుంటుంది. రోజులో 14 గంటలు ఆమె డ్యూటీలోనే గడుపుతోంది. ఈ సర్వీసులో ఇప్పటిదాకా వీరోచితంగా ఛేజ్‌ చేసి ఆమె ఎంతో మంది నేరగాళ్ల ఆటకట్టించింది కూడా. అందంగా ఉంది.. రిస్క్‌ చేసి ఈ ఉద్యోగం చేయడం ఎందుకు? హాయిగా ఏ మోడల్‌ కుదరకుంటే ఆన్‌లైన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కావొచ్చు కదా అని కొందరు ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు ఆమెకు. కానీ,

ఆమె మాత్రం ‘నో’ అని తెగేసి చెప్తోంది. ‘‘ఒకవేళ మరోసారి కెరీర్‌ను ఎంచుకోమని దేవుడు అవకాశం ఇస్తే.. నేను పోలీస్‌ వృత్తినే ఎంచుకుంటా. ఎందుకంటే నేను ఎలా ఉంటానో అలాగే ఉండడం నాకు ఇష్టం. ఈ వృత్తి నాకు ఎంతో నచ్చింది. పోలీస్‌ వ్యవస్థ కూడా నాకు అంతే గౌరవం ఇచ్చింది. రంగు, రూపం, అందం ఇవన్నీ పుట్టుకతో వచ్చినవి.  కానీ, శాశ్వతమైంది మాత్రం ఆత్మవిశ్వాసమే. నా తల్లిదండ్రులు నాలో దేశభక్తిని నింపారు.నా దేశం కోసం.. నేరరహిత సమాజం కోసం ఈ వృత్తిని ఎంచుకున్నా.. వీడే ప్రసక్తే లేదు. రిస్క్‌ చేయడంలోనే మజా ఉంటోంది కదా అని చెబుతోందామె. 

తాజాగా డియానా రామిరెజ్‌ను బెస్ట్‌ పోలీస్‌/మిలిటరీ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అవార్డుకు నామినేట్‌ చేశారు అక్కడ. బాధ్యత గల వృత్తుల్లో ఉంటూ సోషల్‌ మీడియాలో కంటెంట్‌ క్రియేట్‌ చేస్తూ ఎక్కువ మందిని ఆకట్టుకునేవాళ్లకు ఈ గుర్తింపు ఇవ్వాలని ఇన్‌స్టాఫెస్ట్‌ అవార్డుల పేరుతో ఓ మీడియా హౌజ్‌ అవార్డులను ప్రదానం చేయడం ప్రారంభించింది అక్కడ.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top