Video Of Giant Snake Coiling Itself Around Man Goes Viral Again - Sakshi
Sakshi News home page

వామ్మో: ఒక్కసారిగా పాములన్నీ మీద పడ్డాయి!

Feb 4 2021 5:39 PM | Updated on Feb 4 2021 8:34 PM

Man Surrounded By Snakes Video Goes Viral Again - Sakshi

‘‘50 మిలియన్‌ డాలర్లు ఇస్తే ఇక్కడ ఓ గంట సేపు గడపగలరా’’

కాలిఫోర్నియా: ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. సాధారణంగా చాలామంది కుక్కలు, పిల్లులు, గుర్రాలను పెంచుకోవడానికే ఇష్టపడతారు. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జే బ్రూవర్‌ మాత్రం కాస్త విభిన్నం. చిన్నప్పటి నుంచి ఆయనకు పాములంటే పిచ్చి అట. అందుకే పెద్దయ్యాక వాటి కోసం ఏకంగా ఓ ‘జూ’ ఏర్పాటు చేశారు. అంతేకాదు, పాముల మధ్య కూర్చుని సరదాగా కబుర్లు కూడా చెప్పుకుంటారట. ఇందుకు సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెండేళ్ల క్రితం రిప్టైల్‌ జూ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేసిన ఈ వీడియోను.. అక్వాలేడీ అనే పేరు గల ట్విటర్‌ అకౌంట్‌లో మంగళవారం పోస్ట్‌ చేశారు. (చదవండి: షాకింగ్‌: పసుపు రంగులోకి మారిన శరీరం!)

‘‘50 మిలియన్‌ డాలర్లు ఇస్తే ఇక్కడ ఓ గంట సేపు గడపగలరా’’ అంటూ నెటిజన్లకు సవాల్‌ విసిరారు. ఇక ఈ వీడియోకు ఇప్పటికే రెండున్నర లక్షలకు పైగా వ్యూస్‌ రాగా, వేలల్లో కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ‘‘వామ్మో.. ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే.. నేను మాత్రం ఈ పనికి ఒప్పుకోను’’ అంటూ ఒకరు కామెంట్‌ చేయగా... ‘‘విష రహిత పాములైతే నేను ట్రై చేస్తా’’ అని మరొకరు ధైర్యం ప్రదర్శించారు. కాగా తన చిన్ననాటి కలను ఎలా నెరవేర్చుకున్నానో చెబుతూ... ‘‘మీరు కూడా మీ ఆశయాలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నించండి’’అంటూ జే వీడియోలో సలహాలు ఇస్తుండగా.. ఒక్కసారిగా పాములన్నీ ఆయన మీద పడ్డాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలు ప్రస్తుతం ట్విటర్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement