ఆమెతో చాలామంది లవ్‌లో పడ్డారు.. కానీ! | MAGA Fell In Love With A Blonde US Army Soldier | Sakshi
Sakshi News home page

ఆమెతో చాలామంది లవ్‌లో పడ్డారు.. కానీ!

Mar 21 2026 7:30 PM | Updated on Mar 21 2026 7:30 PM

MAGA Fell In Love With A Blonde US Army Soldier

ఆమెతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ కలిసి నడిచారు.. రష్యా అధ్యక్షుడు కలిసి ఫోటోలు దిగారు. మెలానియా ట్రంప్‌ కలిశారు..  ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా సమావేశమయ్యారు.  చివరకు వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్‌ మదురోను కూడా బంధించారు. ఇలా రూపకల్పన చేసిన ఆ మహిళకు మిలియన్‌ సంఖ్యలో ఫాన్స్‌ వచ్చిపడ్డారు. 

కానీ అసలు వాస్తవం ఏంటంటే..కృత్రిమ మేధస్సుతో (AI) రూపొందించిన చిత్రాల్లో జెసికా ఫోస్టర్ అనే మహిళ ఒకటి,. ఆమె ఉనికిలో లేదు.. కానీ ఏఐ జనరేటెడ్‌ టెక్నాలజీ ఆమెను రూపొందించి ఇలా ప్రపంచానికి పరిచయం చేశారు. . ఆమెకు సోషల్‌ మీడియాలో ఒక ఫ్యాన్స్‌ పేజ్‌ కూడా క్రియేట్‌ చేయబడింది. 

అమెరికా ఆర్మీ సైనికురాలిగా చూపించారు. ఆమెను ‘అమెరికా ఫస్ట్’అజెండాకు సేవలందిస్తున్న అసాధారణ జీవితం గడుపుతున్న మహిళగా చిత్రీకరించారు. హోర్ముజ్‌ జలసంధిలో యుద్ధనౌకపై హీల్స్‌ వేసుకుని నిలబడి ఉండటం.. ప్రసంగాలు ఇవ్వడం, ఇతర మహిళా సైనికులతో పిల్లో ఫైట్స్‌ చేయడం, ప్రపంచంలోని ప్రసిద్ధులైన వ్యక్తులను కలవడం ఇలా అన్నీ ఆమెతో చిత్రీకరించారు.

ఆమెకు యువత ఫిదా..!
ఆమెను చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె ఏఐ జనరేటెడ్‌ మహిళలా లేదు. దివి నుంచి దిగివచ్చిన ఒక అందమైన కన్యలా ఉంది. అందుకే యువత ఆమెకు ఫిదా అయ్యారు. లవ్‌ ఎమోజీలతో ఆమెకు మెస్సేజ్‌లు పెట్టారు. 

ఆమె ఎంత అందంగా" ఉందో అని వ్యాఖ్యానిస్తూ, ఆమె అమెరికా ఫస్ట్ సందేశాన్ని ప్రశంసించిన వారిలో చాలా మంది  పురుషులు తమ ప్రొఫైల్ చిత్రాలలో ఆమెనే పెట్టుకున్నారట. ఆమె కొన్ని ఫోటోలకు 30,000 కంటే ఎక్కువ లైక్‌లు రాగా, ఆమె నిజమైన వ్యక్తి కాదనే విషయం తెలియక లేదా పట్టించుకోక, వినియోగదారులు కామెంట్లను హార్ట్-ఐస్ ఎమోజీలతో నింపేశారు. లక్షల్లో ఫ్యాన్‌ ఫోలోయింగ్‌, 30 వేలకు పైగా లైక్‌లు ఆమె ఫోటోలకు వచ్చాయని వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది.  ప్రస్తుతం ఆమె కోసం సృష్టించిన అకౌంట్లను డిలీట్‌ చేశారు. 

ఇది నిజంగా పిచ్చే..!
ఇలా ఏఐ సృష్టికి మనుషులు మోసపోవడం నిజంగానే వారి పిచ్చికి అద్దం పడుతుందని మాజీ ఇల్లినాయిస్‌ రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు ఆడమ్‌ కిన్జింగర్ ట్వీట్‌ చేశారు. జెసికా పోస్టర్‌ అనేది అమెరికా ఆర్మీ సైనికురాలు కాదు.. ఏఐ చేత సృష్టించబడిన మహిళ. ప్రజలు కామెంట్లు, ఏమి చెబుతున్నారో చూస్తే ఏఐతో ఇలా మోసపోతారా అనిపిస్తోంది’ అని ఆయన కామెంట్‌ చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement