కరోనా రోగుల శవ పరీక్షల్లో షాకింగ్‌ విషయాలు

Lung Injuries And Blood Clots Are Common In Corona Patients Says Study - Sakshi

లండన్‌ : కరోనా వైరస్‌ మృతుల పోస్టుమార్టమ్‌ నివేదికల ద్వారా పలు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్‌ కారణంగా మృతి చెందిన వారిలో ఊపిరితిత్తుల్లో గాయాలు, రక్తం గడ్డకట్టడం వంటివి సాధారణంగా ఉన్నాయని లండన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. వారు నిర్వహించిన పది పోస్టుమార్టాల్లో మృతులందరికీ ఊపిరితిత్తుల్లో గాయాలున్నాయని, ప్రారంభ లక్షణాలుగా ఊపిరితిత్తుల్లో మచ్చలు, కిడ్నీల్లో గాయాలు అయ్యాయని తెలిపారు.  దాదాపు తొమ్మిది మందిలో ప్రధాన అవయవాలైన గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులో​ రక్తం గడ్డ కట్టిందని పేర్కొన్నారు. ( కరోనా భారత్‌: 30 లక్షలు దాటిన కేసులు )

ఈ మేరకు ఓ నివేదికను ఇంపీరియల్‌ కాలేజ్‌ వెబ్‌సైట్లో‌ ప్రచురించారు. తాము కనుగొన్న ఈ వివరాల ద్వారా కరోనా రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉందని, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ ద్వారా సంభవించే మరణాలను అడ్డుకోవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. బ్లడ్‌ తిన్నర్స్‌ను ఉపయోగించటం ద్వారా రక్తం గడ్డకట్టకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చని చెప్పారు. ఇలాంటి పరిశోధనలు రోగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించటానికి, సరైన చికిత్స అందించటానికి ఉపయోగపడతాయని అన్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top