Sakshi News home page

Iran Satellite Launch: మూడు ఉపగ్రహాలను ప్రయోగించిన ఇరాన్‌

Published Mon, Jan 29 2024 6:12 AM

Iran successfully launches three satellites into space - Sakshi

జెరూసలేం: గాజాలో హమాస్, ఇజ్రాయెల్‌ ఆర్మీకి మధ్య కొనసాగుతున్న భీకరపోరు కారణంగా మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మూడు ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపినట్లు ఇరాన్‌ ప్రకటించింది. సిమోర్ఘ్‌ రాకెట్‌తో వాటిని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు తెలిపింది. సెమ్నాన్‌ ప్రావిన్స్‌లోని ఇమామ్‌ ఖొమైనీ అంతరిక్ష కేంద్రంలో రాత్రివేళ ఈ ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది.

ఇందులో మహ్దా అనేది పరిశోధక ఉపగ్రహం కాగా, కేహాన్‌–2, హతెఫ్‌–1 అనేవి జీపీఎస్, కమ్యూనికేషన్‌కు సంబంధించిన నానో శాటిలైట్లని ప్రభుత్వ టీవీ తెలిపింది. గాజాపై యుద్ధంలో సైనికపరంగా జోక్యం చేసుకోనప్పటికీ, ఇటీవల జరిగిన ఇస్లామిక్‌ స్టేట్‌ భారీ ఆత్మాహుతి దాడి, ఇరాన్‌ అండదండలున్న హౌతీ తిరుగుబాటుదారులు విదేశీ నౌకలపై దాడులు చేయడం వంటివి ఇరాన్‌ మతపెద్దలపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలోనే ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టినట్లుగా భావిస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement