ట్రంప్‌ ఒకటి తలిస్తే.. జరిగింది మరోకటి..? | Iran now being run by revolutionary guards | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ఒకటి తలిస్తే.. జరిగింది మరోకటి..?

Apr 11 2026 10:22 AM | Updated on Apr 11 2026 10:34 AM

Iran now being run by revolutionary guards

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇ‍జ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఇరాన్‌లో పాలన మార్పు కోసం తహతహలాడారు. ఇందుకోసం ఆ దేశంపై యుద్ధమే ప్రకటించి సుప్రీం లీడర్‌ ఖమేనీని అంతమెుందించారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఖమేనీ అంతం తర్వాత టెహ్రాన్‌ను పాలిస్తున్న కొత్త నాయకత్వం మునుపటి కంటే మరింత కఠినమైన మత భావజాలం కలదని తెలుస్తోంది. దీంతో యుఎస్‌ఏ, ఇజ్రాయెల్‌ పరిస్థితి అయోమయంగా మారింది.

ఇరాన్‌లో పాలన మార్పు కోసం ఆ దేశంలోని ప్రజలు లక్షల సంఖ్యలో రోడ్లెక్కారు. మతఛాందస వాదుల చేతిలో పాలన ఉందని వారు గద్దెదిగాలని నిరసనలు చేపట్టారు. దీంతో ఆ తిరుగుబాటుని అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. దీంతో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.దీంతో ఇదే అవకాశంగా భావిస్తు వచ్చిన ట్రంప్‌ మెుదట నుంచి ఇరాన్‌ను హెచ్చరిస్తూ వచ్చారు. అణ్వయుధాలు తయారు నెపంతో పాటు అక్కడి ప్రజలు సైతం పాలన మార్పు కోరుకుంటున్నారని యుద్ధం ప్రారంభించారు. యుద్ధంలో తొలిరోజే ఆ దేశ సుప్రీం లీడర్‌ ఖమేనీని అంతమెుందించారు. అయితే ఖమేనీ మరణంతో ఆయన కుమారుడు పగ్గాలు చేపట్టారు.. ఇది అంతా తెలిసిన విషయమే అయినా ఇప్పుడు అధికారంలో ఉన్న వారు గత ఖమేనీ కంటే ఇంకా ప్రమాదకరమైన వ్యక్తులని ఇజ్రాయెల్‌ రహస్య నివేదికలు ఇచ్చినట్లు కథనాలు వచ్చాయి.

అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రకారం.. ప్రస్తుతం ఇరాన్‌ పాలిస్తున్న నాయకులు అధికశాతం ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ నుంచే వచ్చారని కథనాలు పేర్కొన్నాయి. . వీరికి గత పాలకులతో పోలిస్తే మతఛాందస సిద్ధాంతాలు మరింత అధికంగా ఉంటాయని కఠిన వైఖరి అవలంభిస్తారని తెలిపాయి. ఈ వివరాలను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ రహస్యంగా నివేదించినట్లు కథనాలు పేర్కొన్నాయి. అయితే ట్రంప్‌, నెతన్యాహూ సైతం పలుమార్లు ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇరాన్‌లో పాలన మార్పుకు ఇది సరైన సమయమని దీన్ని అవకాశంగా తీసుకొని రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టాలని తెలిపారు.

అయితే అక్కడి ప్రజలు దాన్ని తిరస్కరించి. మానవహారాలుగా ఏర్పడి అక్కడి మౌళిక సదుపాయాలకు రక్షణగా నిలిచారు. అయితే ట్రంప్, నెతన్యాహు ఒకటి తలిస్తే ఆ దైవం మరోటితలచిందన్న చెందాన ప్రస్తుత పరిస్థితి ఉందని కథనాలు పేర్కొన్నాయి. కాగా ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతిచర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం భవిష్యత్తు ఏంటో ఈ రోజు తేలే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement