ప్రభుత్వంపై విమర్శలు.. ప్రముఖ నటి అరెస్ట్‌

Famous Actress Arrest Iran Protest - Sakshi

కైరో: ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై అసత్యాలను ప్రచారం చేశారనే ఆరోపణలపై ప్రముఖ నటి తరానెహ్‌ అలీదూస్తి (38) శనివారం అరెస్టయ్యారు. నిరసనలకు మద్దతు ప్రకటించిన పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే అరెస్టవడం తెలిసిందే. ఆందోళనల్లో పాలుపంచుకున్నారంటూ గత రెండు నెలల్లో ఇద్దరిని ఉరి తీశారు.

ఈ చర్యలను తరానెహ్‌ సోషల్‌ మీడియాలో తీవ్రంగా ఖండించారు. గతంలోనూ ఆమె ప్రభుత్వ వైఖరిని నిరసించారు. ఆస్కార్‌ గెలుచుకున్న ‘ది సేల్స్‌మ్యాన్‌’తో పాటు ది బ్యూటిఫుల్‌ సిటీ, ఎబవుట్‌ ఎల్లీ వంటి హాలీవుడ్‌ సినిమాల్లో తరానెహ్‌ నటించారు.
చదవండి: విషాదం.. అమెరికాలో భారత వ్యాపారవేత్త మృతి

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top