విషాదం.. అమెరికాలో భారత వ్యాపారవేత్త మృతి | Indian American Entrepreneur Die Cottage Catches Fire Us New York | Sakshi
Sakshi News home page

విషాదం.. అమెరికాలో భారత వ్యాపారవేత్త మృతి.. ఇంటికి మంటలు అంటుకొని..

Dec 18 2022 3:59 PM | Updated on Dec 18 2022 3:59 PM

Indian American Entrepreneur Die Cottage Catches Fire Us New York - Sakshi

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌లో విషాదం జరిగింది. కాటేజ్ హోంకు నిప్పంటుకుని భారత సంతతి యువ వ్యాపారవేత్త తాన్య బాతిజ(32) ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 14న జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఆమె పెంపుడు కుక్క కూడా చనిపోయింది.

తాన్య న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ డిక్స్ హిల్స్ కాటేజ్ హోంలో నివసిస్తోంది. డెసెంబర్ 14న ఉదయం 3 గంటల సమయంలో ఆమె కాటేజ్‌కు నిప్పంటుకుంది. నిద్ర నుంచి లేచి అగ్నికీలలు చూసి షాక్ అయింది. వెంటనే సాయం కోసం పోలీసులకు ఫోన్‌ చేసింది.

హుటాహుటిన రంగంలోకి దిగిన ఇద్దరు పోలీసులు తాన్యను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ భారీ అగ్నికీలల ధాటికి ఆమెను చేరుకోలేకపోయారు. ఫైరింజన్ పూర్తిగా మంటలు ఆర్పే సమయానికి తాన్య అగ్నికి ఆహుతైంది. ఆమె పెంపుడు కుక్క కూడా మరణించింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఈ ఘటనలో నేరపూరితంగా ఏమీ కన్పించడం లేదని పోలీసులు స్పష్టం చేశారు.
చదవండి: అవసరమైతే అణుబాంబు వాడతాం.. భారత్‌కు పాక్ మంత్రి బెదిరింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement