మూడో ప్రపంచ యుద్ధం రానివ్వను..ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌ హామీ

Donald Trump Said  Who Can Prevent World War III At Election Rally - Sakshi

అమెరికా అధ్యక్ష బరిలోకి దిగతానని ప్రకటించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంచి జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం అయోవాలోని డావెన్‌పోర్ట్‌లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తాను మాత్రమే అమెరికాను రక్షించగల ఏకైక వ్యక్తినని, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా చూస్తానంటూ ప్రగల్పాలు పలికారు. ప్రస్తుతం ప్రపంచం ఎన్నడూ లేనంతగా ప్రమాదకరమైన స్థితిలో ఉందన్నారు.

ట్రంప్‌ తన ప్రసంగంలో..ఈ రోజు మీ ముందు నిలబడి వాగ్దానం చేయగల ఏకైక అభ్యర్థిని. మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటాను. ఎందుకంటే కచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని విశ్వసిస్తున్నా. అంతేగాదు రష్యాను అధ్యక్షుడు జో బైడెన్‌ చైనా చేతుల్లోకి నెట్టాడని విమర్మించారు. పుతిన్‌తో తనకు గొప్ప సంబంధాలు ఉన్నాయన్నారు. అతను తన మాట వింటాడు కాబట్టి ఉక్రెయిన్‌ సమస్యను సులభంగా పరిష్కరించగలనన్నారు.

తాను ప్రతి విషయంలోనూ సరైనవాడనని గొప్పలు చెప్పారు. కాగా, అంతకుమునుపు ట్రంప్‌ కన్జర్వేటివ్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ..మన దేశాన్ని ద్వేషించి పూర్తిగా నాశనం చేయాలనుకునే వ్యక్తుల నుంచి రక్షించే పోరాటం చేస్తున్నానన్నారు. అమెరికా నియోకాన్‌లు, గ్లోబలిస్టులు, బహిరంగ సరిహద్దు మతోన్మాదుల మూర్ఖులచే పాలించబడిందంటూ సాంప్రదాయ పార్టీలోని బహుముఖ ప్రముఖులను పేరుపేరున విమర్శించాడు. అమెరికన్లు చైనాను ప్రేమించే రాజకీయనాయకులతోనూ, అంతులేని విదేశీ యద్ధాల మద్దతుదారులతో అమెరికన్లు విసిగిపోయారని ట్రంప్‌ అన్నారు.

(చదవండి: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు యత్నం.. రాళ్లు రువ్వి అడ్డుకుంటున్న మద్దతుదారులు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top