
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలు జరపాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయన ఇరాన్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో మీరు మాతో చర్చలకు సన్నద్ధం అవుతారని ఆశిస్తున్నాను’అని పేర్కొన్నారు.
శుక్రవారం ఫాక్స్ బిజినెస్ నెట్‌వర్క్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇరాన్‌తో అణుఒప్పందం చేసుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఆ దిశగా ఇరాన్ చర్చలు జరపాలని కోరుకుంటున్నాను. ఈ ఒప్పందం సఫలమైతే ఆదేశానికే మంచిది.
ఇక నేను రాస్తున్న లేఖకు ఇరాన్ సమాధానం ఇస్తుందనే అనుకుంటున్నాను. ప్రతిఫలంగా ఆదేశానికి అమెరికా ఏదో ఒకటి చేస్తోంది. ఎందుకంటే మరే ఇతర దేశంతో అణు ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. ఇక, ట్రంప్ రాసిన ఆ లేఖ ఇరాన్ సుప్రీం లీడర్ ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ఇంటి అడ్రస్‌కు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఆ లేఖపై వైట్ హౌస్ అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది.
మరోవైపు, అంతర్జాతీయ స్థాయిలో అణు ఆయుధాల ఒప్పందాలపై ప్రయత్నాలు జరుగుతున్నాయయని ఇదే విషయాన్ని ఇరాన్ రాయబారి కాజెం జాలాలితో చర్చించినట్లు శుక్రవారం రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.