ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి.. ఎగసిపడుతున్న మంటలు | Russia Launches Massive Drone Strikes on Ukraine’s Dnipropetrovsk; Fires Reported | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి.. ఎగసిపడుతున్న మంటలు

Aug 30 2025 7:32 AM | Updated on Aug 30 2025 11:32 AM

Dnipropetrovsk Region Under Massive Attack

కైవ్: రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఉక్రెయిన్‌లోని డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతం శనివారం తెల్లవారుజామున భీకర దాడికి గురైందని స్థానిక అధికారులు తెలిపారు. డ్నిప్రో, పావ్‌లోగ్రాడ్‌లలో కూడా దాడులు జరిగాయని పేర్కొన్నారు.
 

‘ఈ ప్రాంతం భారీ దాడుల్లో చిక్కుకుంది. పేలుళ్లు శబ్ధాలు వినిపిస్తున్నాయి’అని గవర్నర్‌ సెర్గి లైసాక్ ‘టెలిగ్రామ్‌’లో పేర్కొన్నారు. రష్యాలోని క్రాస్నోడార్ క్రైలోని చమురు శుద్ధి కర్మాగారాన్ని ఉక్రేనియన్ డ్రోన్లు ఢీకొట్టిన  అనంతరం రష్యా ఈ దాడులకు పాల్పడింది.
 

‘కైవ్ ఇండిపెండెంట్’ నివేదిక ప్రకారం, స్థానిక సమయం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయని, డ్రోన్లు ఎగురుతున్నాయని స్థానికులు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. చమురు శుద్ధి కర్మాగారంలో పెద్ద  ఎత్తున మంటలు  ఎగసిపడుతున్నట్లు ఆ వీడియోల్లో కనిపిస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement