
కైవ్: వరుస దాడులతో ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కైవ్‌పై రష్యా జరిపిన దాడిలో 21 మంది మృతిచెందారు. ఈ దాడిలో పలు ఆయుధ కర్మాగారాలు దెబ్బతిన్నాయి. రాత్రివేళ డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి రష్యా ఈ దాడులకు తెగబడింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం క్షిపణుల దాడులతో కైవ్ నగరం దద్దరిల్లింది. ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని యూరోపియన్ యూనియన్ మిషన్, బ్రిటిష్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంతో సహా కైవ్‌లోని మొత్తం 33 ప్రదేశాలలో పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఈ సైనిక ఆపరేషన్ పలు ఆయుధ కర్మాగారాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. కీవ్‌పై దాడులను మాస్కో ధృవీకరించింది.
🚨🇺🇦 KYIV – RUSSIAN ATTACK#BREAKING | Aug 28, 2025
Russia launched a large-scale drone & missile attack on Kyiv overnight, killing more than a dozen people and wounding many, while damaging multiple buildings.
📰 Source: Fox News#Ukraine #Russia #Kyiv #MissileStrike #Conflict pic.twitter.com/yMlq4oUgWY— NewsX - 24/7 (@NewsX_24_7) August 28, 2025
కాగా ఉక్రెయిన్ సైన్యం ఇన్‌కమింగ్ డ్రోన్‌లను, క్షిపణులను అడ్డుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 13 ప్రదేశాలలో రష్యా విజయవంతంగా తన దాడులను కొనసాగించింది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు దాడులను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ దాడులలో ఇజ్రాయెల్ రక్షణ సంస్థ ఉక్ర్‌స్పెక్‌సిస్టమ్స్ కార్యాలయం ధ్వంసమయ్యింది. 2014లో నెలకొల్పిన ఉక్ర్‌స్పెక్‌సిస్టమ్స్‌లో మానవరహిత వైమానిక వాహనాలను తయారు చేస్తుంటారు.కాగా టర్కిష్ రక్షణ సంస్థ బేరక్తర్ నిర్వహిస్తున్న కైవ్‌లోని ఒక ప్లాంట్‌ను కూడా రష్యా ధ్వంసం చేసింది.