హెలికాప్టర్‌ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం | Czech influencer drops million dollar from helicopter triggers a rush Viral video | Sakshi
Sakshi News home page

వీడియో: హెలికాప్టర్‌ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం

Oct 26 2023 6:26 PM | Updated on Oct 26 2023 6:35 PM

Czech influencer drops million dollar from helicopter triggers a rush Viral video - Sakshi

హఠాత్తుగా ఆకాశంలో హెలికాఫ్టర్‌. దాని నుంచి కుప్పలుగా కింద పడ్డ కరెన్సీ.. 

చెక్‌ రిపబ్లిక్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌, టీవీ హోస్ట్‌ కమిల్ బార్టోషేక్ తన ఫాలోయర్లకోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు.  ఏకంగా  10 లక్షల డాలర్లను వారి కోసం హెలికాప్టర్‌ నుంచి జార విడవడం వైరల్‌ అవుతోంది.  ప్రపంచంలోనే తొలిసారి డాలర్ల వర్షం అంటూ ముందుగానే ప్రకటించి మరీ తన ఫ్యాన్స్‌ను అబ్బుర పరిచాడు.  దీంతో ఈ డబ్బులను దక్కించుకునేందుకు సంచులతో ఎగబడ్డారు ఫ్యాన్స్‌. లైసా నాడ్ లాబెమ్ పట్టణానికి సమీపంలో  ఈ ఘటన చోటు చేసుకుంది. 

కజ్మా అనే మారుపేరుతో బార్టోస్జెక్ సోషల్‌మీడియాలో బాగా పాపులర్‌. తను ప్రకటించిన ఒక పోటీ ప్రకారం  కజ్మా తన చిత్రం 'వన్‌మాన్‌షో: ది మూవీ'లో పొందుపరిచిన కోడ్‌ను ఛేదించాలి. అయితే, దీన్ని ఎవరూ పరిష్కరించలేకపోయారు. దీంతో మరో ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రకటించాడు. ఈ ప్రోగ్రాం కింద సైన్‌ చేసిన వారిందరికీ ఈ ప్రైజ్‌మనినీ గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించాడు.  

దీని ప్రకారం ఆదివారం ఉదయం ఆరు గంటలకు డబ్బును ఎక్కడ పడేస్తాడనే ఎన్‌క్రిప్టెడ్ సమాచారంతో వారికి ఈమెయిల్‌ పంపాడు. అన్నట్టుగా సేమ్‌ ప్లేస్‌కి వెళ్లి నిర్ణీత సమయంలో  తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. హెలికాప్టర్‌ నుంచి  డాలర్ల వర్షం  కురపించాడు. ఈ వీడియోను కజ్మా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో  షేర్ చేశాడు ''ప్రపంచంలో  తొలిసారి నిజమైన  డబ్బు వర్షం. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదు. గాయాలు కాలేదు కూడా అంటూ తన పోస్ట్‌లో  వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement