పీక్స్‌లో కరోనా..? చైనా నిర్ణయంతో ప్రపంచ దేశాలకు గుబులు!

Chinese make travel plans as Covid rules ease further - Sakshi

బీజింగ్‌: చైనాలో ఒకవైపు కరోనా కల్లోలం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉన్నా సరిహద్దులను తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రజల్లో కొత్త జోష్‌ నింపుతోంది. కరోనా వెలుగు చూసిన మూడేళ్ల తర్వాత తొలిసారిగా విదేశీ ప్రయాణాలకు వీలు చిక్కేలా కన్పిస్తుండటంతో వారు సంబరపడుతున్నారు. జనవరి చివర్లో వచ్చే చైనా న్యూ ఇయర్‌ సంబరాల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇప్పట్నుంచే ప్లాన్‌ చేసుకుంటున్నారు.

చైనా బుకింగ్‌ వెబ్‌సైట్‌ ట్రిప్‌.కామ్‌ తదితర సైట్లలో పలు దేశాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు మామూలు కంటే ఏకంగా పది రెట్లు ఎక్కువగా బుకింగ్‌లు జరుగుతున్నాయి! విదేశాల నుంచి వచ్చేవారికి జనవరి 8 నుంచి క్వారంటైన్‌ నిబంధనను చైనా ఎత్తేస్తుండటంతో పలు దేశాల్లోని చైనీయులు కూడా స్వదేశానికి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. మరోవైపు ఈ పరిణామం ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది.

చైనా పర్యాటకులతో పాటు కరోనా కూడా మరోసారి వచ్చిపడుతుందేమోనని బెంబేలెత్తుతున్నాయి. దాంతో చైనా నుంచి ప్రయాణికుల రాకపై నిషేధం విధించే అంశాన్ని అమెరికా, భారత్‌తో పాటు పలు దేశాలు చురుగ్గా పరిశీలిస్తున్నాయి. భారత్‌తో పాటు జపాన్, దక్షిణ కొరియా, తైవాన్‌ ఇప్పటికే చైనా ప్రయాణికులకు కరోనా పరీక్షలను తప్పనిసరి చేశాయి. కరోనాకు ముందు వరకూ అమెరికాతో పాటు పలు ఆసియా, యూరప్‌ దేశాలను సందర్శించే విదేశీ పర్యాటకుల్లో చైనీయుల సంఖ్యే ఎక్కువగా ఉండేది.

అంతమయ్యే లక్షణాలే!
చైనాలో కరోనా విలయం తాండవం చేస్తున్నా వైరస్‌ అంతమయ్యే ముందు అలాగే విధ్వంసం సృష్టిస్తుందని అక్కడి వైద్య నిపుణులుంటున్నారు. ఇక కరోనా ముగిసిపోయే దశకు వచ్చేసినట్టేనని చెబుతున్నారు. దేశంలో కరోనా పరీక్షలను బాగా తగ్గించేశారని చైనా జెజాంగ్‌ ప్రావిన్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న భారతీయ డాక్టర్‌ అభిషేక్‌ కుందు చెప్పారు. ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి వచ్చిన వారు, ఇళ్లల్లో కోవిడ్‌–19 కిట్‌ కొనుక్కొని చేసుకుంటున్నవారే తప్ప ప్రభుత్వం చేసే పరీక్షలు తగ్గిపోయాయని అన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో అత్యధికులు కోలుకుంటున్నారని, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారని డాక్టర్‌ కుందు వివరించారు. 

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

28-12-2022
Dec 28, 2022, 09:54 IST
కరోనా మహమ్మారి మరోసారి చైనాను కబళిస్తోంది. ప్రజాగ్రహానికి లొంగి కఠిన ఆంక్షలు సడలించి నెలైనా కాకముందే దేశంలో కల్లోల పరిస్థితులు...
28-12-2022
Dec 28, 2022, 08:40 IST
బీజింగ్‌: చైనాలో కరోనా నానాటికీ చుక్కలు చూపుతోంది. రోజూ లక్షలాది మంది దాని బారిన పడుతున్నారు. షాంఘై సమీపంలోని పారిశ్రామిక...
27-12-2022
Dec 27, 2022, 04:17 IST
సాక్షి, అమరావతి: చైనాతోపాటు మరికొన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కరోనా...
27-12-2022
Dec 27, 2022, 03:47 IST
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు కేంద్రంగా గ్రామ స్థాయిలోనే సమర్థంగా కరోనా నివారణ, నియంత్రణ, చికిత్స చర్యలు చేపట్టాలని...
25-12-2022
Dec 25, 2022, 05:37 IST
బీజింగ్‌: చైనాలో కరోనా కల్లోలం నానాటికీ ఉగ్ర రూపు దాలుస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాదిగా కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రజాందోళనలకు తలొగ్గి...
25-12-2022
Dec 25, 2022, 05:32 IST
గాంధీనగర్‌/న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ కట్టడి చర్యల్లో భాగంగా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం నడుంబిగించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే...
24-12-2022
Dec 24, 2022, 18:39 IST
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ను మళ్లీ కోవిడ్‌ భయం వణికిస్తోంది.
24-12-2022
Dec 24, 2022, 11:33 IST
సాక్షి, హైదరాబాద్‌: చైనా తదితర దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌ను తప్పకుండా తీసుకోవాలని ఏఐజీ...
24-12-2022
Dec 24, 2022, 07:57 IST
సాక్షి, అమరావతి: చైనా, ఇతర దేశాల్లో పంపిణీ చేసిన కరోనా టీకాలతో పోలిస్తే మన వ్యాక్సిన్లు చాలా శక్తిమంతమైనవని, వైరస్‌...
24-12-2022
Dec 24, 2022, 05:39 IST
న్యూఢిల్లీ: సూదితో అవసరం లేని కోవిడ్‌–19 టీకా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన...
24-12-2022
Dec 24, 2022, 04:48 IST
చైనాలో కరోనా కల్లోలం భారత్‌లోనూ భయభ్రాంతులకు కారణమవుతోంది. దేశంలో నాలుగో వేవ్‌ మొదలైపోతుందని ప్రచారం జరుగుతోంది. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్‌...
23-12-2022
Dec 23, 2022, 09:39 IST
బీజింగ్‌: చైనాలో జీరో కోవిడ్‌ విధానం అకస్మాత్తుగా వెనక్కి తీసుకోవడంతో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్‌...
23-12-2022
Dec 23, 2022, 04:59 IST
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మనమంతా ఇక మేల్కొనాలని కేంద్ర ఆరోగ్య...
23-12-2022
Dec 23, 2022, 04:25 IST
సాక్షి, అమరావతి: వివిధ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు చర్యలు...
23-12-2022
Dec 23, 2022, 04:20 IST
సాక్షి, అమరావతి/డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): ఒకవేళ మన రాష్ట్రం­లో కోవిడ్‌ బీఎఫ్‌–7 వేరియంట్‌ ప్రభావం చూపితే.. సమ­ర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంతా...
22-12-2022
Dec 22, 2022, 12:24 IST
న్యూఢిల్లీ: చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరోసారి దడ పట్టిస్తోంది. కోవిడ్‌ పుట్టినిల్లుగా భావించే చైనాలో ఒమిక్రాన్‌లో సబ్‌వేరియెంట్‌ ప్రస్తుతం...
22-12-2022
Dec 22, 2022, 12:07 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కొత్త వేరియంట్‌ బీఎఫ్‌-7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న...
22-12-2022
Dec 22, 2022, 11:09 IST
సాక్షి, హైదరాబాద్‌: మన దేశంలో కోవిడ్‌ ఫోర్త్‌వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నవన్ని ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లేనని,...
22-12-2022
Dec 22, 2022, 01:45 IST
న్యూఢిల్లీ: చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో...
22-12-2022
Dec 22, 2022, 00:16 IST
ఒకరికి తెద్దునా... ఇద్దరికి తెద్దునా... అందరికీ తెద్దునా అని జనవ్యవహారం. చైనా తప్పిదాలతో కరోనా మళ్ళీ దేశదేశాల్లో కోరలు సాచే...



 

Read also in:
Back to Top