16 ఏళ్లలోపు వారికి నో సోషల్‌ మీడియా | Canada introduces bill to ban social media for childrens Under 16 years | Sakshi
Sakshi News home page

16 ఏళ్లలోపు వారికి నో సోషల్‌ మీడియా

Jun 12 2026 6:06 AM | Updated on Jun 12 2026 6:26 AM

Canada introduces bill to ban social media for childrens Under 16 years

బిల్లు తెచ్చిన కెనడా ప్రభుత్వం

ఒట్టావా: దేశంలోని 16 ఏళ్ల బాలబాలికలకు సోషల్‌ మీడియా వేదికలను కట్టడి చేసేందుకు ఉద్దేశించిన డిజిటల్‌ సేఫ్టీ బిల్లును కెనడా ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. సామాజిక వేదికల నిర్వాహకులు తగు కారణాలను చూపిన పక్షంలో కొన్ని వెసులుబాట్లను కల్పిస్తామని మాత్రం తెలిపింది. సామాజిక మాధ్యమాల కారణంగా బాలలకు హాని వాటిల్లరాదన్నదే లక్ష్యమని కెనడా మంత్రి మార్క్‌ మిల్లర్‌ తెలిపారు. 

చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ చాట్‌బాట్‌ సేవలను వినియోగించే విషయంలో 16 ఏళ్లలోపు వారికి పరిమితులను ఈ బిల్లులో ప్రతిపాదించారు. సామాజిక వేదికలను సురక్షితంగా వాడుకునేందుకు అవసరమైన నిబంధనలను కూడా పొందుపరిచారు. ప్రతిపాదిత సేఫ్‌ సోషల్‌ మీడియా చట్టం ద్వారా సోషల్‌ మీడియా సేవలు, ఏఐ చాట్‌బాట్‌ నిర్వాహకులు.. ఏదైనా నష్టం, హాని జరిగితే అరికట్టేలా, పూర్తి బాధ్యత వహించేలా చేస్తామని మంత్రి తెలిపారు. యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీస్, మలేసియా తదితర దేశాలు సైతం ఇలాంటి ప్రతిపాదనలను రూపొందించే పనిలో ఉన్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement