● అనుమతులు లేకుండా ప్యాకెట్ల తయారీ
● నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదని గుర్తింపు
అంబర్‌పేట: నిర్దేశిత ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్న మూడు వాటర్ ప్లాంట్లపై మంగళవారం సికింద్రాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, జీహెచ్‌ఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. అంబర్‌పేట బాపూనగర్‌లో సయ్యద్ జబ్బార్ జేఎన్ ఎంటర్‌ప్రైజెస్ పేరిట నిర్వహిస్తున్న ప్లాంట్‌లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వాటర్ ప్యాకెట్లు తయారు చేస్తునట్లు గుర్తించారు. రూ.3 లక్షల విలువైన యంత్రాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మహ్మద్ నయీముద్దీన్ ఆక్వా ఓమెగా వాటర్ ప్లాంట్‌ను కనీస ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇతని వద్ద నుంచి రూ.2.80 లక్షలు విలువ చేసే యంత్రాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అంబర్‌పేట ప్రధాన రహదారిలో సయ్యద్ జునైద్ టీఏఐఏ ప్లస్ పేరుతో నీటి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. ఇతని వద్ద రూ.3.50 లక్షలు విలువ చేసే ప్యాకింగ్ యంత్రాలు, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మూడు ప్లాంట్ల నుంచి నీటి నమూనాలను సేకరించారు.


