‘బెస్ట్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌’ నగరంగా గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

‘బెస్ట్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌’ నగరంగా గుర్తింపు

Apr 8 2026 7:44 AM | Updated on Apr 8 2026 7:44 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌

చందానగర్‌: దేశంలోనే హైదరాబాద్‌ ‘బెస్ట్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌’ నగరంగా గుర్తింపు పొందిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అన్నారు. మంగళవారం నానక్‌రాంగూడలోని షరటాన్‌ హోటల్‌లో ఈపీటీఆర్‌ఐ, హైదరాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ మున్సిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (హెచ్‌ఎంఎస్‌డబ్ల్యూ) సంయుక్తాధ్వర్యంలో ‘అర్బన్‌ సాలిడ్‌ వేస్ట్‌ గవర్నెన్స్‌ అండ్‌ కంప్లైంట్స్‌ అండర్‌ ఎస్‌డబ్ల్యూఎం రూల్స్‌–2026’ అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు నగరంలో సేకరించే చెత్తను జవహర్‌నగర్‌లో డంపింగ్‌ చేస్తూ వచ్చామన్నారు. నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో కొత్తగా చెత్త డంపింగ్‌ కోసం ప్రభుత్వం కొత్త ప్రాంతాలను పరిశీలిస్తోందన్నారు. కార్యక్రమంలో రాంకీ సంస్థ చైర్మన్‌ గౌతం రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement