 
															నేటి నుంచి సీఎం రోడ్ షో
సాక్షి, సిటీబ్యూరో/వెంగళరావునగర్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా సీఎం రేవంత్‌రెడ్డి రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్‌లలో ప్రసంగించనున్నారు. మొత్తం మూడు విడతలుగా వరుసగా రెండు రోజుల చొప్పున ఆరు రోజుల పాటు రోడ్ షో నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం వెంగళరావునగర్ డివిజన్ నుంచి రోడ్ షో ప్రారంభించనున్నారు. సాయంత్రం 7 గంటలకు యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ ప్రధాన రహదారి నుంచి నిమ్స్ మీదుగా వెంగళరావునగర్ డివిజన్‌లో రోడ్ షో సాగుతుంది. రహమత్‌నగర్ చౌరస్తాలోని పీజేఆర్ విగ్రహం వద్ద సీఎం ఓపెన్ టాప్ వాహనంపై చేపల మార్కెట్ ప్రధాన రహదారి (జీటీఎస్ టెంపుల్‌కు వెళ్లే మార్గం) నుంచి జవహర్‌నగర్ అడ్డరోడ్డుకు చేరుకుంటారు. అక్కడ నుంచి జవహర్‌నగర్ మెయిన్‌్ రోడ్డు మీదుగా సాయిబాబా దేవాలయం సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహం (కృష్ణకాంత్ పార్క్ పక్కన) వద్దకు చేరుకుని అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సిద్ధార్థనగర్ కాలనీ, సిద్ధార్థనగర్ పార్కు మీదుగా వెంగళరావునగర్ కాలనీ, అయ్యప్పగ్రౌండ్, అక్కడ నుంచి మధురానగర్ కాలనీలోని వెల్లండి ఫుడ్స్, అనంతరం ఆల్‌సబ హోటల్ మీదుగా మైత్రీవనం చేరుకుంటారు. అక్కడి నుంచి ఎస్‌ఆర్‌నగర్ సిగ్నల్స్, ఇమేజ్ హాస్పిటల్, సాలిటేర్ బిల్డింగ్స్ సమీపంలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం రోడ్ షో సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
