 
															కార్తీక దీపోత్సవం
ఇబ్రహీంపట్నం: కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకొని గురువారం పట్నంలోని భవాని నాగలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయంత్రం దీపోత్సవాన్ని నిర్వహించారు. శివలింగం, స్వస్తిక్, ప్రమిదల రూపాలను పూలతో అలంకరించి, అఖండ దీపాన్ని, ప్రమీదల్లోని దీపాలను భక్తులు భక్తి శ్రద్ధలతో వెలిగించారు. ఉసిరిక, మట్టి దీపాన్ని, వస్త్ర దానాలు శ్రావణ నక్షత్రం రోజు చేస్తే కోటి సోమవారాల వృత ఫలితం దక్కుతుందన్న విశ్వాసం భక్తుల్లో ఉంది. శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు చేసి, దీపాలను ఆలయంలోని అయ్యగారికి దానం చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
