
వర్షం నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వర్షాల వల్ల నీరు నిలిచే వాటర్ లాగింగ్ పాయింట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్‌తో కలిసి లక్డీకాపూల్ వద్ద మెహదీ ఫంక్షన్ హాల్, పీటీఐ బవన్, చీచా రెస్టారెంట్ వద్ద వాటర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించారు. అప్పటికే అక్కడ నిలిచిన వర్షపు నీరును ఇంజనీరింగ్ సిబ్బంది తొలగించారు. అదే చోట ఇరుకుగా ఉండడం, రోడ్డు లెవెల్ డిఫరెన్స్ ఉండడంతో మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలు స్లోగా వెళ్లడం వల్ల ట్రాఫిక్ తరచుగా నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయనీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్..కర్ణన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై తమతో ఉన్న చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్‌తో కమిషనర్ చర్చించారు. సాధ్యమైనంత త్వరగా లెవెల్ డిఫరెన్స్ తొలగించడంతో పాటు సీసీ వేయాలని చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించారు. అక్కడే అదనంగా మరో లేన్ వచ్చేలా చూడాలన్నారు. తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
వాటర్ లాగింగ్ పాయింట్లపైఫోకస్ పెట్టండి
ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సత్వర చర్యలు చేపట్టాలి
అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశం