చందానగర్: విధి నిర్వహణలో ఉన్న ఓ పారిశుధ్య కార్మికుడిని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. చందానగర్ సర్కిల్ 21 పరిధిలోని మదీనాగూడ జాతీయ రహదారిపైన ఉన్న సెంట్రల్ డివైడర్ వద్ద మంగళవారం ఉదయం పారిశుధ్య పనులు చేస్తున్న ప్రసాద్‌ను వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో గాయపడిన ప్రసాద్‌ను చికిత్స కోసం సమీపంలోని ఓ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నేతలు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

బైకు ఢీకొని పారిశుధ్య కార్మికుడికి గాయాలు