
పాల ప్యాకెట్‌ల తరహాలో కల్లు ప్యాకెట్లు
సాక్షి, సిటీబ్యూరో: కిరాణా దుకాణాల్లో పాల ప్యాకెట్‌ల తరహాలో హోటళ్లలో కల్లు ప్యాకెట్‌ల అమ్మకాలు జరుగుతున్నాయి. కల్తీకల్లుపై పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తోన్న ఎకై ్సజ్‌శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు గుండ్లపోచంపల్లి అయోధ్యనగర్ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా హోటళ్లలో ఎస్‌వీఎస్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్న కల్లు ప్యాకెట్‌లను గుర్తించారు. హోటళ్లలో తినుబండారాలతో పాటు ఎస్‌వీఎస్ కల్లుప్యాకెట్‌లు కూడా విక్రయించడం అధికారులను విస్మయానికి గురిచేసింది. పక్కా సమాచారంతో ఎకై ్సజ్ అధికారులు సుభాష్‌చందర్, బాలరాజు,అఖిల్, రవిచంద్ర తదితరులు తమ సిబ్బందితో కలిసి దాడులు చేసి కల్లు ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. శంకర్‌గౌడ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఈ హోటల్‌లో 270 లీటర్ల కల్లు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా కల్లు విక్రయిస్తున్న శంకర్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకొని కల్లు ప్యాకెట్లను మేడ్చల్ ఎకై ్సజ్ స్టేషన్‌లో అప్పగించారు. మల్కాజిగిరిలో అనుమతి లేకుండా విక్రయిస్తున్న 20 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకుని పారబోశారు. సైదాబాద్ ప్రాంతంలో అనుమతి లేకుండా కల్లు అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో టీమ్ లీడర్ అంజి రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసి 750 లీటర్ల కల్లునుస్వాధీనం చేసుకున్నారు. నిందితులు పల్లె భిక్షపతి, బొడిగే శ్రీనివాస్ గౌడ్‌లపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.