కాజీపేట అర్బన్: మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలు తయారు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. కాజీపేట మండలం మడికొండలోని ఇండస్ట్రియల్ పార్క్‌లోని కాకతీయ టెక్స్‌టైల్ పార్క్, వివర్స్ వెల్ఫేర్స్ పొదుపు పరపతి పరస్పర సహాయక సంఘం, ఐటీ సెజ్, గ్రానైట్ పరిశ్రమలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించి మాట్లాడుతూ.. 164 యూనిట్లతో ఉన్న టెక్స్‌టైల్ పార్క్‌లో ఉత్పత్తి ప్రారంభించని యూనిట్లను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఆధునిక టె క్నాలజీతో గ్రానైట్, మార్బుల్స్ తయారు చేయడం అభినందనీయమని అన్నారు. ఐటీ సెజ్‌లో పని చేస్తున్న యువత ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నవీన్‌కుమార్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ స్వామి నాయక్, కాజీపేట తహసీల్దార్ సీహెచ్.రాజు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి..
మడికొండలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ చాహత్ తెలిపారు. మడికొండలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
హనుమకొండ కలెక్టర్
చాహత్ బాజ్‌పాయ్
ఇండస్ట్రియల్ పార్క్‌లో విస్తృత పర్యటన


