ఓరుగల్లు పీఠాధిపతిగా విజయపాల్‌ పట్టాభిషేకం | - | Sakshi
Sakshi News home page

ఓరుగల్లు పీఠాధిపతిగా విజయపాల్‌ పట్టాభిషేకం

Jul 4 2026 2:31 AM | Updated on Jul 4 2026 2:31 AM

కాజీపేట రూరల్‌ : కాజీపేట ఫాతిమా కేథడ్రల్‌ ప్రాంగణంలో శుక్రవారం ఓరుగల్లు కథోలిక పీఠం (డయాసిస్‌) 4వ నూతన పీఠాధిపతిగా దుగ్గింపూడి విజయపాల్‌రెడ్డి పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. రోమ్‌ నుంచి లియోపోప్‌ పంపిన అధికార ఉత్తర్వులను పోప్‌దూత సెక్రటరీ లాటిన్‌ భాషలో చదివి వినిపించారు. హైదరాబాద్‌ ఆర్చ్‌ బిషప్‌ కార్డినల్‌ పూల ఆంథోని, విశాఖ ఆర్చ్‌ బిషప్‌ ఉడుమల బాల, శ్రీకాకుళం బిషప్‌ రాయరాల విజయ్‌కుమార్‌ సహాకారంతో బిషప్‌గా ఎన్నికై న ఫాదర్‌ విజయపాల్‌రెడ్డిని కతోలిక ఆధ్యాత్మిక సంప్రదాయనుసారం తైలాభిషేకం చేసి తలపై శిరస్త్రాణాన్ని ధరింపజేసి బిషప్‌గా పట్టాభిషేకం చేశారు. నూతన బిషప్‌ విజయపాల్‌రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. పోప్‌లియో తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానన్నారు. వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల ఫాదర్లు, కథోలికులు, 20 మంది బిషప్‌లు, 500 మంది ఫాదర్లు, 500 మంది సిస్టర్లు, బ్రదర్లు, ప్రజలు పాల్గొన్నారు.

విజయపాల్‌ను సన్మానించిన ఎమ్మెల్యేలు

నూతన బిషప్‌ విజయపాల్‌ను వరంగల్‌ పశ్చిమ ఎ మ్మెల్యే రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొ ండ రాజయ్య, కొండేటి శ్రీధర్‌, ‘కుడా’ చైర్మన్‌ ఇనగా ల వెంకట్రాంరెడ్డి, ఏనుమాముల మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ ప్రియాంక అనిల్‌కుమార్‌ తదితరులు ఘనంగా సన్మానించారు. బిషప్‌ పట్టాభిషేకం ముందు నూతన బిషప్స్‌ హౌజ్‌ను కార్డినల్‌, సీబీసీఐ అధ్యక్షుడు పూల ఆంథోని ప్రారంభించారు.

ఊరేగింపుగా వేదిక వద్దకు..

కార్డినల్‌ పూల ఆంథోని, నున్షియో సెక్రటరీ ఒక వాహనంలో, నూతన బిషప్‌గా పట్టాభిషేకం పొందనున్న విజయపాల్‌ ప్రత్యేక వాహనంలో బ్యాండ్‌ వాయిద్యాల నడుమ ప్రదర్శనగా హౌజ్‌ నుంచి పట్టాభిషేక వేదిక వద్దకు తొడ్కోని వచ్చారు.

పాల్గొన్న రోమ్‌ పోప్‌ దూత సెక్రటరీ,

అగ్ర పీఠాధిపతులు, ఫాదర్లు,

ప్రజాప్రతినిధులు, అధికారులు,

దైవ సేవకులు

తరలివచ్చిన వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల కథోలిక విశ్వాసులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement