‘దూరవిద్య’లో ఉద్యోగుల చేతివాటం! | - | Sakshi
Sakshi News home page

‘దూరవిద్య’లో ఉద్యోగుల చేతివాటం!

Jul 4 2026 2:31 AM | Updated on Jul 4 2026 2:31 AM

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలోని దూరవిద్య సీడీఓఈ/ఎస్‌డీఎల్‌సీఈలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు, కోర్సు పూర్తయ్యాక వివిధ సర్టిఫికెట్లు తీసుకునేందుకు ఆన్‌లైన్‌ పద్ధతిలోనే ఫీజులు చెల్లించేందుకు క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులో తీసుకువచ్చారు. దూరవిద్య కేంద్రానికి వచ్చేవారు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి ఫీజులు చెల్లించి అడ్మిషన్లతో పాటు సర్టిఫికెట్లు తీసుకోవచ్చు. దూరవిద్యలో అడ్మిషన్లు పొందే వారి నుంచి, వివిధ సర్టిఫికెట్లు పొందేవారి నుంచి కొంతమంది ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు నిదర్శనం ఇటీవల దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బి.సురేష్‌లాల్‌ దూరవిద్య కేంద్రానికి సంబంధించిన బ్యాంకుల్లో జమ అవుతున్న ఫీజుల వివరాలను పరిశీలించగా అందులో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా దూరవిద్య కేంద్రంలోని తొమ్మిది మంది ఔట్‌సోర్సింగ్‌ , కాంట్రాక్టు ఉద్యోగుల ఫోన్‌ల ద్వారానే దూరవిద్య కేంద్రంలోని క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి పే చేసినట్లు వెల్లడైంది.

లక్షల్లో పేమెంట్లు..

దూరవిద్య కేంద్రంలోని ఓ ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగి తన ఫోన్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌కు కొంతమంది అభ్యర్థుల ఫీజులు రూ.6లక్షల 47వేలు, ఓ మహిళా ఉద్యోగి రూ.6లక్షల 6వేలు చెల్లించినట్లు, మరో ఉద్యోగి రూ.4లక్షల 27వేలు, ఇంకో ఉద్యోగి రూ.2లక్షల 30వేలు చెల్లించినట్లు గుర్తించారు. ఇలా మొత్తం 9 మంది ఉద్యోగులు అభ్యర్థుల నుంచి ఫీజుల డబ్బులు తీసుకొని దూరవిద్య కేంద్రానికి క్యూర్‌ కోడ్‌ ద్వారా చెల్లించినట్లు గుర్తించారు. ఈ తొమ్మిది మందిలో ఇటీవల ఒకరు ఉద్యోగ విరమణ పొందారు.

9 మంది ఉద్యోగులకు మెమోలు జారీ

కేయూ దూరవిద్య కేంద్రంలోని ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు 8 మందికి దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బి.సురేష్‌లాల్‌ మూడ్రోజుల క్రితం మెమోలు జారీచేశారు. అందులో రిటైర్డ్‌ ఉద్యోగికి కూడా వాట్సాప్‌లో మెమో పంపారు. మీరు అభ్యర్థుల నుంచి ఫీజుల డబ్బులు తీసుకొని చెల్లించడం అనేది ఆర్థిక పరమైన అవకతవలకు కిందికే వస్తుందని మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని 7రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆయా ఉద్యోగులకు జారీచేసిన మెమోలో పేర్కొన్నారు. ఇదే విషయం ఇప్పటికే కేయూ వీసీ ప్రొఫెసర్‌ ప్రతాప్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని సీరియస్‌గా పరగిణిస్తున్నారని తెలిపారు. మెమోలకు వివరణ ఇచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఫీజు డబ్బుల కంటే ఎక్కువ వసూలు?

దూరవిద్య కేంద్రంలో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు

9 మంది ఉద్యోగులకు మెమోలు జారీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement