● వరంగల్ యువకుడి అసాధారణ దేశ భ క్తి
నయీంనగర్: నేతాజీ గౌరవం కోసం, ఆయన స్ఫూర్తితో దేశ ప్రజల్లో చైతన్యం నింపేందుకు వరంగల్‌కు చెందిన దేశభక్తుడు ఆడెపు కిశోర్ కుమార్ వరంగల్ నుంచి మొదలైన బైక్ యాత్ర కన్యాకుమారి నుంచి హిమగిరుల కాశ్మీర్ వరకు సాగింది. 13వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకున్న ఆయన గురువారం స్వస్థలమైన వరంగల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని 20కి పైగా రాష్ట్రాల గుండా ఈ యాత్ర సాగిందని తెలిపారు. నేతాజీ లాంటి మహానుభావునికి దేశంలో సరైన గుర్తింపు రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుని జపాన్‌లో ఉన్న ఆయన అస్థికలను వెంటనే భారత్‌కు తీసుకురావాలని, నేతాజీ స్ఫూర్తి, భావజాలం, దేశభక్తి భావితరాలకు చాటి చెప్పాలన్నారు.


