హరితహారం లక్ష్యం ఇలా.. | - | Sakshi
Sakshi News home page

హరితహారం లక్ష్యం ఇలా..

Jul 3 2026 1:34 AM | Updated on Jul 3 2026 1:34 AM

ఎవెన్యూ ప్లాంట్స్‌..

డివైడర్లలో 4,37,686
చెరువు కట్టలు, బండ్‌లపై 90,720
పీపీవీ, పార్కులు 1,74,593
సంస్థాగత 70,946
ఎంఎల్‌ఏపీ 1,000
ఇతర మొక్కలు 55,032

15.20 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

వర్షాలు కురిస్తే 15 రోజులకు.. లేదంటే వచ్చే నెల ప్రారంభం

వన మహోత్సవానికి గ్రేటర్‌ ఉద్యాన శాఖ సిద్ధం

రహదారి పక్కన

20,023

గృహాలకు

6,70,000

నర్సరీలో సిద్ధంగా ఉన్న మొక్కలు

వరంగల్‌ అర్బన్‌: చారిత్రక, వారసత్వ ఓరుగల్లు మహా నగరాన్ని హరితమయంగా మార్చేందుకు జీడబ్ల్యూఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి, గ్రేటర్‌ వరంగల్‌ ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశాల మేరకు కసరత్తులు పూర్తి చేశారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేశారు. పక్షం రోజుల వ్యవధిలో మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ వర్షాలు కురవకపోతే ఆగస్టు మొదటి వారంలో 15.20 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా, అందులో బల్దియా పరిధిలో 6 లక్షల మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి. మరో 9.20 లక్షల మొక్కలను పబ్లిక్‌, ప్రైవేట్‌ సంస్థల నుంచి కొనుగోలు చేసి దిగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

16 నర్సరీల్లో మొక్కలు సిద్ధం..

క్రిస్ట్రియన్‌ కాలనీ, లక్ష్మీ మెగాటౌన్‌ షిప్‌లో, తిమ్మాపూర్‌లో, వెస్ట్‌సిటీ, సూర్యకుటీర్‌, బాలసముద్రం ఎల్లపూర్‌, నక్కలగుట్టలో ప్రభుత్వ బీఈడీ కళాశాలలో, హెచ్‌ఎండీఏతోపాటు ప్రైవేట్‌ సంస్థల తదితర ప్రాంతాల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పూలు, పండ్లు, అలంకరణ మొక్కలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

తట్టుకునేలా..

నగర వాతావరణంలో సులువుగా, బలమైన వేర్లతో వృద్ధి చెందే దేశీ జాతి మొక్కలకు వన మహోత్సవంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు వెల్ల డించారు. అవసరమైన చోట రావి, దారుల పొడవునా, పార్కులు, సంస్థల్లో నీడనిచ్చే వివిధ రకాల మొక్కలు పెంచుతామంటున్నారు. గాలి, వానల ను తట్టుకుని నిలిచే వాటిపై దృష్టిపెట్ట కున్నట్లు స్పష్టం చేస్తున్నారు.

ప్రతీ ఇంటికి 3 మొక్కల పంపిణీ

నగరంలో ప్రతీ ఇంటికి 3 మొక్కలు పంపిణీ చేసేలా లక్ష్యం పెట్టుకున్నారు. ఆయా డివిజన్లలో అందుబాటులో ఉన్న వాటర్‌ ట్యాంక్‌లు, పార్కులు, నర్సరీల్లో వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పలురకాల పండ్లు, పూల జాతులు, నీడనిచ్చే మొక్కలను అందించనున్నారు. రోడ్లు, అంతర్గత రహదారులు, మోడల్‌ కా లనీల పొడవునా మాస్టార్‌ ప్లాన్‌కు సంబంధించిన 80,60 ఫీట్ల రహదారుల్లో మల్టీ రో అవెన్యూ మొక్కలతో అలంకరణ జాతుల మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్‌ కింద విస్తృతంగా నాటనున్నారు.

అందరీని భాగస్వాముల్ని చేస్తాం..

వనమహోత్సవ కార్యక్రమాన్ని నగరంలో అమలు చేసేందుకు ముందుస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, స్లమ్‌ సమాఖ్యల ప్రతినిధులను, కాలనీ అసోసియేషన్‌, వేల్పేర్‌ కమిటీ ప్రతినిధులను, స్వచ్ఛంద, యువజన సంఘాలందరినీ ఈబహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తాం.

– లక్ష్మారెడ్డి, బల్దియా ఉద్యాన శాఖ అధికారి

నగర వ్యాప్తంగా ఉన్న 149 కిలోమీటర్ల పరిధి రహదారుల వెంట 26,335 మొక్కలు నాటనున్నారు.

మీడియం, జంక్షన్లు 65.95 చదరపు కిలోమీటర్లు ఉండగా, 3,23,465 మొక్కలు నాటాలని నిర్ణయించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు, ఆస్పత్రులు, హాస్టళ్లు తదితర 16 ప్రాంతాల్లో ఇన్‌స్టలేషన్‌ ప్రాంతాల్లో 45,800 మొక్కలు నాటనున్నారు.

మడికొండ ఓఆర్‌ఆర్‌లో 6 ప్రాంతాల్లో 1,000 మొక్కలు, విద్యుత్‌ నగర్‌ 1,000 మొక్కలు నాటాలని నిర్ధారించారు.

చెరువులు, బండ్‌ తదితర 18 ప్రాంతాల్లో 32 వేల మొక్కలు నాటనున్నారు.

ఖాళీ స్థలాలతోపాటు, శ్మశాన వాటికల్లో మొక్కలు నాటేందుకు ప్రతిపాదించారు.

మొక్కలు నాటడంతో పాటు ప్రత్యేకంగా వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement