గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్)ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల నిర్వహణను పటిష్టంగా కొనసాగించాలని కమిషనర్ టి.వెంకన్న సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం బల్దియా కార్యాలయంలో ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాల పురోగతిపై కమిషనర్ అధికారులతో సమీక్షించారు. సమావేశంలో ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేశ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేందర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోశ్‌కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
బండ్ పనులు త్వరగా పూర్తి చేయండి
కాజీపేట రూరల్: గ్రేటర్ వరంగల్ నగరంలోని వడ్డేపల్లి బండ్‌పై కొనసాగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం వడ్డేపల్లి బండ్ వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ధర్మసాగర్ రిజర్వాయర్ పరిశీలన
ధర్మసాగర్: ప్రజలకు రోజూ నల్లాల ద్వారా నీటిని సరఫరా చేయాలని కమిషనర్ ఇంజనీర్లను ఆదేశించారు. ధర్మసాగర్ రిజార్వాయర్‌ను పరిశీలించిన ఆయన ఇంజినీర్లకు పలు సూచలిచ్చారు. నాణ్యతతో కూడిన తాగు నీరందించాలని కోరారు.


