వాగు వద్ద భద్రత పెంచాలి | - | Sakshi
Sakshi News home page

వాగు వద్ద భద్రత పెంచాలి

Jul 2 2026 6:49 AM | Updated on Jul 2 2026 6:49 AM

జంపన్న వాగు పవి త్రంగా భావించి వేలా ది మంది భక్తులు పు ణ్యస్నానాలు ఆచరి స్తారు. భక్తుల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉంది. వాగులో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో వాగులోకి దిగకుండా భక్తులను మైకుల ద్వారా అప్రమత్తం చే యాలి. భక్తులు కూడా నీటి లోతు తెలియని ప్రాంతాల్లో స్నానాలకు దిగకుండా జాగ్రత్తలు పాటించాలి. అధికారులు భద్రతా ఏర్పా ట్లు కల్పిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చు.

– సిద్ధబోయిన స్వామి,

సమ్మక్క పూజారి, మేడారం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement