తెగిన ఓహెచ్‌ఈ వైరు.. ఆలస్యంగా నడిచిన రైళ్లు | - | Sakshi
Sakshi News home page

తెగిన ఓహెచ్‌ఈ వైరు.. ఆలస్యంగా నడిచిన రైళ్లు

Jul 2 2026 6:49 AM | Updated on Jul 2 2026 6:49 AM

డోర్నకల్‌: మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ రైల్వే జంక్షన్‌ పరిధిలోని సిగ్నల్‌తండా సమీపంలో అప్‌ లైన్‌లో ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్యూప్‌మెంట్‌) లైన్‌ తెగిపడింది. బుధవారం తెల్ల వారుజామున ఓహెచ్‌ఈ వైరు తెగి డౌన్‌లైన్‌పై పడడంతో రెండు మార్గాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మహబూబాబాద్‌, డోర్నకల్‌, భద్రాచలం రోడ్‌ మార్గంలో పలు ఎక్స్‌ప్రెస్‌తో పాటు గూడ్సు రైళ్లు నిలిచాయి. ఓహెచ్‌ఈ సిబ్బంది స్పందించి మొదట డౌన్‌లైన్‌ మార్గంలో ఓహెచ్‌ఈ కేబుల్‌కు మరమ్మతులు చేసిన అనంతరం 50 నిమిషాల తర్వాత రైళ్లను పునరుద్ధరించారు. అనంతరం అప్‌లైన్‌లో సుమారు 3.30 గంటలపాటు శ్రమించి కేబుల్‌కు మరమ్మతులు చేసి ఉదయం 7.30 గంటలకు రైళ్లను పునరుద్ధరించారు. ఓహెచ్‌సీ కేబుల్‌ తెగి విద్యుత్‌ సరఫరా నిలిచి ఎక్కడి రైళ్లు అక్కడ నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

విద్యుత్‌ సమస్యల

పరిష్కారానికి స్థానిక కోర్టులు

సీజీఆర్‌ఎఫ్‌

వరంగల్‌ చైర్మన్‌ నాగ ప్రసాద్‌

హన్మకొండ: విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి స్థానిక కోర్టులు నిర్వహిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్‌ సీజీఆర్‌ఎఫ్‌ వరంగల్‌ చైర్మన్‌ నాగప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్ణీత రోజున ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ నెల3న మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ డివిజన్‌ 33/11 కేవీ కొత్తపేట సబ్‌స్టేషన్‌లో కొత్తపేట, కురవి, డోర్నకల్‌, గార్ల, సీరోల్‌ మండలాలు, 7న హనుమకొండ రూరల్‌ డివిజన్‌ పరకాల రూరల్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో పరకాల రూరల్‌, ఆత్మకూరు, దామెర, శాయంపేట, పరకాల టౌన్‌, 9న భూపాలపల్లి జిల్లా కాటారం డివిజన్‌ కొయ్యూరు 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌లో కొయ్యూరు, కాటారం, మహాముత్తారం, మహదేవ్‌పూర్‌, పలిమెల, 14న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ డివిజన్‌ కాల్వ శ్రీరాంపూర్‌ సబ్‌డివిజన్‌లోని శ్రీరాంపూర్‌ 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌లో శ్రీరాంపూర్‌, పోత్కపల్లి, ఓదెల, 17న ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ డివిజన్‌, కూసుమంచి సబ్‌ డివిజన్‌లోని రాజేశ్వరాపురం 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌లో రాజేశ్వరాపురం, పాలేరు, నేలకొండపల్లి, కూసుమంచి, బచోడు సెక్షన్‌ పరిధిలోని వినియోగదారులు ఈ లోకల్‌ కోర్టులో ఫిర్యాదులు సమర్పించి సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.

బాలుడిపై పోక్సో కేసు నమోదు

ఖిలా వరంగల్‌ : బాలికపై లైంగిక దాడికి పా ల్పడిన ఓ బాలుడిపై పోక్సో నమోదు చేసి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ తెలిపారు. వరంగల్‌ ఏనుమాముల పీ ఎస్‌ పరిధిలో గత నెల 26న మధ్యాహ్నం ఓ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ సమయంలో ఓ బాలుడు వెళ్లాడు. అనంతరం సదురు బాలిక చెల్లికి డబ్బు ఇచ్చి కిరాణం పంపించా డు. దుకాణం నుంచి వచ్చిన చెల్లి ఈ ఘటనను చూసి కేకలు వేయడంతో సదరు బాలుడు అ క్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బా ధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పో క్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలో పరారీలో ఉన్న బాలుడు బుధవారం పోలీసులకు చిక్కాడు. దీంతో న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement